క్రైమ్/లీగల్

రవిప్రకాష్ క్వాష్ పిటిషన్‌పై విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 22: టీవీ-9 మాజీ సీఈఓ రవిప్రకాష్ క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. అతని పోలీసు కస్టడీ అంశంపై హైకోర్టు మూడు రోజులు స్టే విధించింది. తదుపరి విచారణను గురువారం చేపట్టనుంది. అయితే ఈ కేసులో పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసులు పదే పదే ఎందుకు కస్టడీ కోరుతున్నారని ప్రశ్నించింది. జీవితకాలం జైలులోనే ఉంచాలని చూస్తున్నారా? అని ప్రశ్నించింది. గత ఐదు నెలల్లో గుర్తుకు రాని కేసులన్నీ బెయిల్ ఇచ్చే సమయంలో కొన్ని గంటల ముందు గుర్తుకు వస్తున్నాయా? అని హైకోర్టు ప్రశ్నించింది. పోలీసులు చెప్పే మాటల్లోనే వారి ఉద్దేశ్యం ఏమిటో అర్థమవుతోందని, మూడేళ్లకు మించని శిక్ష విధించే కేసుల్లో నిందితులను పదే పదే పోలీసు కస్టడీకి ఎందుకు కోరుతున్నారని న్యాయమూర్తి ప్రశ్నించారు.
రిక్రూట్‌మెంట్‌లో లోపాలు లేవు
కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్‌లో ఎలాంటి అవకతవలూ జరగలేదని పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు పేర్కొంది. కానిస్టేబుల్స్ రిక్రూట్‌మెంట్‌లో అక్రమాలపై దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. కటాఫ్ మార్కుల కంటే ఎక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థులను ఎంపిక చేయలేదని పేర్కొంటూ పిటిషనర్ ఆరోపించారు. అయితే కానిస్టేబుల్స్ నియామక ప్రక్రియ సక్రమంగానే జరిగిందని, ఫలితాల్లో ఎలాంటి అవకతవకలు చోటు చేసుకోలేదని పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు న్యాయస్థానానికి తెలిపింది. అంతా పారదర్శకంగా నిర్వహించామని పేర్కొన్న బోర్డు ఆ వివరాలను కోర్టు ముందుంచింది. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను ఈనెల 29వ తేదీకి వాయిదా వేసింది.
మారిన తెలంగాణ హైకోర్టు వేళలు
తెలంగాణ హైకోర్టు పనివేళల్లో మార్పులు చేశారు. ఉదయం 10.30 గంటల నుండి మధ్యాహ్నం 1.30 గంటల వరకూ కోర్టులో కేసుల పరిష్కారం జరుగుతుంది. మధ్యాహ్నం 2.30 గంటల వరకూ భోజన విరామం ఇస్తారు. తిరిగి సాయంత్రం 4.30 గంటల వరకూ కేసుల విచారణ జరుగుతుందని హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ తెలిపారు.