క్రైమ్/లీగల్

ఏసీబీ వలలో అటవీ అధికారులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సారంగాపూర్, అక్టోబర్ 22: వేల రూపాయల జీతాలు తీసుకుంటున్నారు.. లక్షల రూపాయల కార్లలో తిరుగుతున్నారు.. గరీబోన్ని సార్.. నన్ను విడిచిపెట్టండి అని ప్రాధేయపడ్డా వినకుండా లంచం ఇవ్వాల్సిందేనంటూ తెగేసి డిమాండ్ చేసిన అటవీ శాఖ అధికారులను ఒక సామాన్య యువకుడు ఏసీబీ అధికారులకు పట్టించాడు. జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలంలోని రేచపల్లి గ్రామంలో ఇల్లుకట్టుకునే కర్రకు అనుమతి కోసం అడిగితే లంచం డిమాండ్ చేసిన అల్లిపూర్ సెక్షన్ అధికారి పవనసుతరాజు, రేచపల్లి బీట్ అధికారి వసీంలను మంగళవారం కరీంనగర్ ఏసీబీ డీఎస్‌పీ ప్రతాప్ నేతృత్వంలోని అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రేచపల్లి గ్రామానికి చెందిన భూక్య గంగాధర్ అనే యువకుడు పాత ఇల్లును కూల్చివేసి అదే కర్రతో నూతన గృహాన్ని నిర్మించుకోడానికి పాత కలప వాడుకునేందుకు అటవీ శాఖ అధికారి పవనసుతరాజును అనుమతికోరారు. రూ. 20 వేలు ఇస్తేనే అనుమతి ఇస్తానని తేల్చి చెప్పారు. అంతగా ఇవ్వలేనని ప్రాధయపడగా లంచ ఇవ్వనిదే పర్మిషన్ ఇవ్వనని ఖరాకండిగా చెప్పారు. గరీబోన్ని కనికరించాలని ప్రాధేయపడితే తనను మెడ పట్టి గెంటివేయాలని సిబ్బందిని అదేశించారని భాదితుడు గంగాధర్ వాపోయాడు. దీంతో అవినీతి అధికారుల ఆట కట్టించాలని నిర్ణయంచుకున్న గంగాధర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించగా వారి పథకం ప్రకారం రూ. 6 వేలు మంగళవారం అందజేశాడు. రేచపల్లి గ్రామానికి చెందిన అటవీ అధికారులు రూ. 6వేలు లంచం తీసుకుంటుండగా రెండ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని వారి చేతులను రసాయనిక మిశ్రమంలో కడిగి ఆధారాలను సేకరించినట్టు ఏసీబీ డీఎస్పీ ప్రతాప్ వెల్లడించారు. ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం అడిగినా 24 గంటల పాటు పనిచేసే 1064 నెంబర్‌కు ఫోన్‌చేసి సమాచారం అందించాలని కోరారు. సారంగాపూర్ మండలంలో మొట్టమొదటి సారిగా ఏసీబీ దాడులు జరుగడం చర్చనీయాంశంగా మారింది. ఏసీబీ దాడుల్లో ఇన్‌స్పెక్టర్లు వేణుగోపాల్, సంజీవ్‌కుమార్, రాముతో పాటు సిబ్బంది పాల్గొన్నారు.
*చిత్రాలు.. ఏసీబీకి పట్టుబడిన అటవీశాఖ అధికారులు పవనసుతరాజు, వసీం
* పట్టించిన బాధితుడు గంగాధర్ (ఇన్‌సెట్‌లో )