క్రైమ్/లీగల్

పెళ్లి ఇంట్లో భారీ చోరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, అక్టోబర్ 22: మరో పది రోజుల్లో పెళ్లి సందడితో కళకళలాడాల్సిన ఇంట్లో దొంగలు చొరబడి, పెద్ద మొత్తంలో సొత్తును అపహరించుకుపోయారు. యువతి పెళ్లి కోసం దాచి ఉంచిన 22 తులాల బంగారు ఆభరణాలు, రెండు కిలోల వెండి నగలు, 15 వేల నగదుతో పాటు విలువైన పట్టు వస్త్రాలు, ఇతర సామగ్రితో ఉడాయించారు. ఈ సంఘటన జిల్లా కేంద్రంలోని వివేకానంద కాలనీలో సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. బాధితుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. కాలనీకి చెందిన పార్థసారథి (రాజు) ఇంట్లో ఉండే యువతికి వివాహం నిశ్చయం అయ్యింది. నవంబర్ 3న పెళ్లి జరపాలని ముహూర్తం ఖరారు కావడంతో కుటుంబీకులంతా గత కొన్ని రోజుల నుండి పెళ్లి ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. పెళ్లిలో సమర్పించే కట్నకానుకలు, బంగారు, వెండి ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులను ఇప్పటికే సమకూర్చుకుని ఇంట్లోని బీరువాలలో భద్రపర్చారు. ఈ క్రమంలోనే సోమవారం సమీప బంధువుల ఇంట్లో ఉన్న వేడుకలో పాల్గొనేందుకు పార్థసారథి కుటుంబీకులంతా తమ ఇంటికి తాళం వేసి మధ్యాహ్న సమయంలో వెళ్లారు. వేడుక ముగించుకుని అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో తిరిగి ఇంటికి చేరుకోగా, తాళాలు ధ్వంసమై తలుపులు తెరిచి ఉండి, ఇంట్లోని వస్తువులన్నీ ఎక్కడికక్కడ చిందరవందరగా పడిఉండడాన్ని చూసి హతాశులయ్యారు. పడకగదిలోని బీరువాలను పరిశీలించగా, అవి కూడా ధ్వంసం చేసి ఉండడంతో చోరీ జరిగినట్టు నిర్ధారించుకుని లబోదిబోమన్నారు. పెళ్లి కోసం బీరువాలో దాచి ఉంచిన 22 తులాల బంగారు ఆభరణాలు, 2 కిలోల వెండి, 15వేల నగదు, ఇతర విలువైన వస్తువులన్నీ అపహరణకు గురి కావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాల్గవ టౌన్ ఎస్‌ఐ లక్ష్మయ్య తన సిబ్బందితో చేరుకుని చోరీ జరిగిన తీరును పరిశీలించారు. సంఘటనా స్థలానికి క్లూస్ టీంను రప్పించి ఆధారాల కోసం అనే్వషించారు. కాగా, తెలిసిన వారే ఈ చోరీకి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని ఎస్‌ఐ లక్ష్మయ్య తెలిపారు.
*చిత్రం... బీరువాలను ధ్వంసం చేసి వస్తువులను చిందరవందరగా పడవేసిన దృశ్యం