క్రైమ్/లీగల్

దివాకర్ ట్రావెల్స్‌పై రవాణా శాఖ కొరడా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, అక్టోబర్ 22: రాష్ట్ర వ్యాప్తంగా దివాకర్ ట్రావెల్స్‌పై రవాణాశాఖ అధికారులు కొరడా ఝుళిపించారు. ఈ ట్రావెల్స్ సంస్థ యజమానులు మోటారు వాహనాల చట్టాలు, ఇతర నిబంధనలను ఉల్లంఘించి బస్సులను నడుపుతున్నారని, రహదారి భద్రతను అతిక్రమించి ప్రభుత్వం, ప్రయాణికులను మోసం చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిన నేపథ్యంలో దాడులు నిర్వహించినట్లు రవాణాశాఖ కమిషనర్ సీతారామాంజనేయులు మంగళవారం మీడియాకు తెలిపారు. సంస్థకు చెందిన 31 స్టేజ్ కారియర్, 18 కాంట్రాక్ట్ క్యారేజి బస్సుల్లో తనిఖీలు నిర్వహిచి వాటిపై కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. మరో 10 కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సులకు పర్మిట్లు రద్దు చేసినట్లు వివరించారు. బస్సులకు సంబంధించి ఇన్సూరెన్స్ సర్ట్ఫికెట్లు కూడా నకిలీవనే ఫిర్యాదులు అందుతున్నందున వీటిపై కూడా పూర్తి స్థాయి విచారణ జరుపుతామని స్పష్టం చేశారు.