క్రైమ్/లీగల్

ఎన్జీ రంగా వర్సిటీ వీసీ దామోదర నాయుడు అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు: ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉప కులపతి డాక్టర్ దామోదర నాయుడును పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. ఓ కాంట్రాక్టు ఉద్యోగి ఇచ్చిన ఫిర్యాదుతో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి, విచారణ అనంతరం తుళ్లూరు డీఎస్పీ శ్రీనివాసరెడ్డి ఆయనను అరెస్ట్ చేశారు. డీఎస్పీ కథనం ప్రకారం.. గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం పురుషోత్తమపట్నంకు చెందిన ఉయ్యాల మురళీకృష్ణ 2016లో అటెండర్‌గా విశ్వవిద్యాలయంలో చేరారు. ఎలాంటి సమాచారం, నోటీసులు లేకుండా ఈ ఏడాది ఏప్రిల్‌లో వీసీ ఆయనను ఉద్యోగం నుండి తొలగించారు. తిరిగి ఉద్యోగం ఇప్పించాలని గత నెల 23న వెలగపూడి సచివాలయంలోని 2వ బ్లాక్ వద్ద వీసీ దామోదర నాయుడును అటెండర్ మురళీకృష్ణ తన మిత్రుడు గుమ్మడి రాజేష్‌తో సహా కలిసి విజ్ఞప్తి చేశారు. అయితే ఆయన తనను కులం పేరుతో దూషించి బెదిరింపులకు పాల్పడినట్లు మురళీకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో గత నెల 24న పోలీసులు వీసీ దామోదర నాయుడుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. సచివాలయంలోని సీసీ కెమెరా ఫుటేజీ ద్వారా వివరాలు నమోదు చేసుకున్న పోలీసులు గుంటూరులోని నవభారత్ నగర్‌లో వీసీ దామోదర నాయుడును అదుపులోకి తీసుకున్నారు.