క్రైమ్/లీగల్

వైద్యుని ఇంట్లో ఎన్‌ఐఏ తనిఖీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచిర్యాల, అక్టోబర్ 19: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ రిటైర్డ్ వైద్యుడు చంద్రశేఖర్ ఇంట్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. కొద్ది రోజుల క్రితం ఎన్ ఐ ఎ అదికారులు వైద్యుని సంప్రదించి వివరాలు అడిగి తెలుసుకొని వెళ్లడం జరిగిందని సమాచారం. సర్చ్ వారెంట్‌తో వచ్చి శుక్రవారం దాదాపు ఏడు గంటల పాటు ఇంట్లో సోదాలు నిర్వహించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మావోయిస్టు రాష్ట్ర సభ్యులు కిరణ్‌కుమార్ అలియాస్ కిరణ్ దాదా, అతని భార్య నర్మద అలియాస్ కృష్ణకుమారిలను ఈ యేడాది జూన్ మాసంలో మహారాష్ట్ర పోలీసులు హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. మావోయిస్టులతో సత్సంబంధాలు ఉన్నాయనే అనుమానంతోనే ఇంట్లో ఆకస్మిక తనిఖీలు చేశారు. చంద్రశేఖర్ ఇంట్లో మావోయిస్టు పార్టీకి సంబంధించిన సిడి, జనతా సర్కార్ పుస్తకం, మావోయిస్టు వార్తలు వచ్చిన పత్రికలు, రూ.27వేలు, సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై వైద్యులు చంద్రశేఖర్ మాట్లాడుతూ గత యేడాది డిసెంబర్‌లో అనారోగ్యంతో బాధపడుతున్న మహిళా మావోయిస్టు నర్మద అలియాస్ కృష్ణ కుమారి చికిత్స కోసం రాగా, ఆమె పేరు నిర్మళ కుమారి అని చెప్పడం జరిగిందని వివరించారు.
వైద్యం కోసం వచ్చినవారు కొంత డబ్బులు తన వద్ద ఉంచారని, కొద్ది రోజుల తర్వాత వచ్చి డబ్బులు తీసుకెళ్లగా మిగిలిన రూ.27వేలను అధికారులు స్వాదీనం చేసుకున్నారు. ప్రభుత్వ వైద్యునిగా గతంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో విదులు నిర్వహించి మంచి పేరు తెచ్చుకున్నందుకే మావోయిస్టు సానుభూతిపరునిగా భావించి తనిఖీలు చేశారు. గతంలో ఎప్పుడో బుక్స్ ఎగ్జిబిషన్‌లో కొనుగోలు చేసిన ఒక పుస్తకం, సిడి, పాత న్యూస్‌పేపర్‌లోని వార్తల కారణంగా అనుమానించి ప్రశ్నించారని తెలిపారు. ఎన్ ఐ ఏ అధికారులకు తాను పూర్తిగా సహకరించానని, వారు ఎప్పుడు పిలిచినా వస్తానని వైద్యుడు చంద్రశేఖర్ పేర్కొన్నారు.

*చిత్రం...ఎన్‌ఐఏ తనిఖీ చేసిన వైద్యుడు చంద్రశేఖర్ నివాసం
* (ఇన్‌సెట్‌లో) వైద్యుడు చంద్రశేఖర్.