క్రైమ్/లీగల్

కోర్టును తప్పుదోవ పట్టించారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, అక్టోబర్ 18: తిరుపతి నగరంలో నాడు అన్నమయ్య స్వామివారికి చేస్తున్న సేవకు మెచ్చి ఆయన కుటుంబ పోషణ కోసం విజయనగరం సార్వభౌముడు శ్రీకృష్ణదేవరాయులు ఇచ్చిన 188.32 ఎకరాల భూమిపై తమకు హక్కులు ఉన్నాయని హైకోర్టు న్యాయవాది, అన్నమయ్య 9వ తరానికి చెందిన తాళ్లపాక కుప్ప రాఘవన్ స్పష్టం చేశారు. ఆ భూములు తమవేనని పేర్కొన్నారు. టీటీడీ ఇనాం భూముల వ్యవహారంలో కోర్టును సైతం తప్పుదోవ పట్టించిందని అన్నారు. ఇటీవల ఇనాం కోర్టు తిరుపతిలోని 188 ఎకరాల 32 సెంట్లు భూమి టీటీడీదేనని తీర్పు ఇచ్చిన విషయం విధితమే. ఈనేపథ్యంలో టీటీడీ ఆ భూములను స్వాధీనం చేసుకోవడానికి సన్నాహాలు చేస్తోంది. ఈక్రమంలో టికె రాఘవన్ ఆ భూములు తమవేనని, తమకు న్యాయం చేయాలని ఆర్‌డిఓ ముందు శుక్రవారం పిల్ దాఖలు చేశారు. ఈసందర్భంగా ఆయన స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ అన్నమయ్య వంశాభివృద్ధి కోసం నాడు శ్రీకృష్ణదేవరాయలు ఇచ్చిన భూములను నేడు భగవంతుని పేరు చెప్పి లేని హక్కులను పొందడానికి టీటీడీ యాజమాన్యం చేస్తున్న ప్రయత్నాలు అధర్మమన్నారు. ఇప్పటివరకు టీటీడీ యాజమాన్యం తాళ్లపాక వంశీయులపై వేసిన కేసులన్నింటిపై కూడా తాళ్లపాక వంశీయులకే అనుకూలంగా తీర్పులు వచ్చాయన్నారు. ఆ తీర్పు ప్రతులను ఇనాం కోర్టు ముందు దాఖలు చేయకుండా టీటీడీ, కోర్టును తప్పుదోవ పట్టించిందన్నారు. తమకు శ్రీకృష్ణదేవరాయలు ఇచ్చిన భూములను దక్కించుకోవడం కోసం న్యాయస్థానంలో ధర్మపోరాటం చేస్తామని, ఇందులో వెనెక్కి తగ్గే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.