క్రైమ్/లీగల్

అగ్రిగోల్డ్ బాధితుల కోసం రూ.264 కోట్లు మంజూరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 18: అగ్రిగోల్డ్ బాధిత డిపాజిటర్లకు చెల్లించేందుకు వీలుగా 264 కోట్ల రూపాయల మంజూరుకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం పాలనా ఆమోదం తెలిపింది. 10వేల రూపాయలు, అంతకు తక్కువ మొత్తం డిపాజిట్ చేసినవారికి చెల్లించేందుకు వీలుగా ఈ నిధులు కేటాయించింది. గంటూరు జిల్లాలో 14.09 కోట్ల రూపాయలు, చిత్తూరు జిల్లాలో 5.81 కోట్లు, తూర్పు గోదావరిలో 11.46 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో 23.05 కోట్లు, విజయనగరం జిల్లాలో 36.97 కోట్లు, శ్రీకాకుళం జిల్లాలో 31.41 కోట్లు, కర్నూలు జిల్లాలో 11.14 కోట్లు, నెల్లూరు జిల్లాలో 16.91 కోట్ల రూపాయలు, కృష్ణా జిల్లాలో 15.04 కోట్లు, అనంతపురం జిల్లాలో 20.64 కోట్లు, కడప జిల్లాలో 13.18 కోట్లు, ప్రకాశం జిల్లాలో 19.11 కోట్లు, విశాఖ జిల్లాలో 45.1 కోట్ల రూపాయలు బాధితులకు ప్రభుత్వం చెల్లించనుంది.
ఏకమొత్తంగా చెల్లింపు
104, 108 వాహనాలను పూర్తిగా సొమ్ము ఒకేసారి చెల్లించి కోనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో ఆయా వాహన తయారీ కంపెనీలతో నేరుగా సంప్రదింపులు జరిపి, వాయిదా పద్ధతిలో కొనుగోలు చేసేందుకు ప్రతిపాదించింది. ఆ నిర్ణయాన్ని మార్చుకుని ఒకేసారి చెల్లించి కొనుగోలు చేసేందుకు నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వాహనమిత్ర పథకం కింద దరఖాస్తు చేసుకునేందుకు గడువును ఈ నెల 31వరకూ ప్రభుత్వం పొడిగించింది. అర్హులకు నవంబర్ 15న నిధులు విడుదల చేయనున్నారు.