క్రైమ్/లీగల్

బెంగళూరులో స్లీపర్ సెల్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, అక్టోబర్ 18: బెంగళూరులో స్లీపర్ సెల్స్ పనిచేస్తున్నాయని, దీనితో ఉగ్రవాద దాడుల ముప్పు పొంచి ఉందని కర్నాటక హోం శాఖ మంత్రి బసవరాజ్ బొమ్మయి సంచలన వ్యాఖ్యలు చేశారు. బెంగళూరు, మైసూరులో ఉన్న ఉగ్రవాద స్లీపర్ సెల్స్ కారణంగా, కర్నాటకతోపాటు, కేరళ, తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లోని తీర ప్రాంతాల్లో దాడులకు జరగవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. జమాత్ ఉల్ ముజాహిదీన్ బాంగ్లాదేశ్ (జేఎంబీ) సంస్థకు చెందిన ఉగ్రవాదుల కనుసన్నల్లో స్లీపర్ సెల్స్ పని చేస్తున్నట్టు నేషనల్ ఇనె్వస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) తాజా నివేదిక స్పష్టం చేస్తున్నదని ఆయన శుక్రవారం విలేఖరులతో మాట్లాడుతూ అన్నారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఎన్‌ఐఏ తమకు సూచించిందని చెప్పారు. అరేబియా సముద్రం మీదుగా దేశంలోకి ఉగ్రమూకలు చొరబడుతున్నట్టు ఎన్‌ఐఏ వద్ద సమాచారం ఉందన్నారు. న్యూఢిల్లీ, ముంబయి వంటి నగరాల్లో విధ్వంసాలకు వీరు సన్నాహాలు చేస్తున్నట్టు బొమ్మయి అనుమానం వ్యక్తం చేశారు. జమ్మూకాశ్మీర్‌కు ఉన్న ప్రత్యేక హోదాను 370 ఆర్టికల్ రద్దు ద్వారా కేంద్ర ప్రభుత్వం తొలిగించిన తర్వాత ఉగ్రవాదుల కదలికలు పెరిగినట్టు తెలిపారు.
ఎన్‌ఐఏ హెచ్చరికల నేపథ్యంలో, రాష్ట్రంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. అదే విధంగా మిగతా రాష్ట్రాలు కూడా అప్రమత్తమవుతున్నాయని బొమ్మయి అన్నారు. ఉగ్రవాదాన్ని కేంద్ర ప్రభుత్వం ఎంతమాత్రం ఉపేక్షించబోదని ఆయన స్పష్టం చేశారు.