క్రైమ్/లీగల్

మావోయిస్టుల పేరుతో దోపిడీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్ : మావోయిస్టుల పేరుతో రియల్టర్లను, వ్యాపారులను బెదిరించి దోపిడీలకు పాల్పడుతున్న ఏడుగురు సభ్యులు గల నకిలీ నక్సల్స్ ముఠాను గురువారం వరంగల్ అర్బన్ జిల్లా మడికొండ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుండి మూడు నాటు తుపాకులు, ఒక ఎయిర్ పిస్తోల్, 60వేల నగదు, మూడు ఆటోలు, ఒక ద్విచక్ర వాహనం, ఎనిమిది సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్ఫోర్స్ అదనపు డీసీపీ చక్రవర్తి వివరించారు. ప్రధాన నిందితుడైన వరంగల్ రూరల్ జిల్లా పరకాల మండలం నడికుడ గ్రామానికి చెందిన తేలకుంట్ల బిక్షపతి గతంలో కొద్ది కాలం మావోయిస్టు పార్టీ సభ్యుడిగా పనిచేసి అరెస్టై జైలు నుండి విడుదలైన అనంతరం జల్సాలకు అలవాటు పడ్డాడు. ఇతను ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు కరీంనగర్ జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రైతులు, వ్యాపారులను లక్ష్యంగా చేసుకొని మావోయిస్టుల పేరుతో కిడ్నాప్‌లు, బెదిరింపులకు పాల్పడుతూ డబ్బులు వసూలు చేసేవాడు. 18కి పైగా నేరాలకు పాల్పడడంతో నిందితుడు వరంగల్, కరీంనగర్ పోలీసులు పలుమార్లు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. జైల్లో శిక్ష అనుభవిస్తున్న సమయంలో గుప్తనిధుల తవ్వకాలకు పాల్పడినందున శిక్ష అనుభవిస్తున్న రామస్వామి, రాజిరెడ్డిలతో పరిచయం ఏర్పడింది. వీరు ముగ్గురు కలిసి ఓ ముఠాగా ఏర్పడి సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో మహబూబాబాద్ జిల్లా ఇల్లందు ప్రాంతానికి చెందిన చంద్రశేఖర్ వద్ద 8 వేల రూపాయలకు ఒక పిస్తోల్‌ను కొనుగోలు చేశారు. డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో నిందితులు ముగ్గురు వరంగల్ అర్బన్ జిల్లా ధర్మాసాగర్‌కు చెందిన అనుట్ల రాజు, ముప్పరపు శ్రీనుతో మడికొండ గ్రామంలోని రైతు కృష్ణమూర్తిని బెదిరించి డబ్బు వసూలు చేసుకునేందుకు రంగం సిద్ధం చేసుకొని, కృష్ణ మూర్తిని కాశిబుగ్గ ప్రాంతంలో ఓ గదిలో బంధిం చి మావోయిస్టులమని పరిచయం చేసుకొని నాటు తుపాకులతో బెదిరించి 50 లక్షల రూపాయలు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశారు. కృష్ణమూర్తి చివరకు ముఠా సభ్యులకు రెండు లక్షల 50 వేల రూపాయలను తన బంధువుల ద్వారా అందజేయగా కృష్ణమూర్తిని మడికొండ ప్రాంతంలో వదిలివెళ్లారు. మరో సంఘటనలో సూరారం గ్రామానికి చెందిన కుమారస్వామి, అశోక్‌లకు తక్కువ ధరకు బంగారం ఇస్తామని నమ్మించి దశల వారీగా ఐదు లక్షల 4 5వేల రూపాయలతో పాటు పది గ్రాముల బంగారం తీసుకొని నకిలీ బంగారంతో ఉన్న కనకదుర్గ దేవత ప్రతిమను అందజేశారు. దేవత ప్రతిమ నకిలీది అని గుర్తించిన బాధితులు నిందితులను నిలదీయడంతో వారు తాము మావోయిస్టులమని చెప్పి బెదిరించారు. గురువారం ఉదయం మడికొండ గ్రామ శివారు ప్రాంతంలోని పెద్దమ్మగుడి వద్ద నిందితులు సంచరిస్తున్నట్టు టాస్క్ఫోర్స్ అదనపు డీసీపీకి సమాచారం రావడంతో ఆయన ఆదేశాల మేరకు టాస్క్ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ నందిరామ్ నాయక్, మడికొండ ఇన్‌స్పెక్టర్ జానీ నర్సింహాతో కలిసి అదుపులోకి తీసుకొని విచారించడంతో వారు నేరాలకు పాల్పడినట్టు అంగీకరించారు. నిందితులను గుర్తించి అరెస్ట్ చేయడంలో ప్రతిభ కనబర్చిన టాస్క్ఫోర్స్ సిబ్బందిని వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ వి. రవీందర్ అభినందించారు.
*చిత్రాలు.. విలేఖరుల సమావేశంలో వివరాలు వెల్లడిస్తున్న డీసీపీ చక్రవర్తి
*పోలీసులు స్వాధీనం చేసుకున్న తుపాకులు (ఇన్‌సెట్‌లో)