క్రైమ్/లీగల్

ఈడీ కస్టడీకి చిదంబరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పి.చిదంబరంను ఐఎన్‌ఎక్స్ మీడియా మనీలాండరింగ్ కేసులో అక్టోబర్ 24వరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కస్టడీకి అప్పగిస్తూ ట్రయల్ కోర్టు ఆదేశాలు జారీ చేయడంతో ఈడీ గురువారం ఆయనను తీహార్ జైలులోనుంచి తీసుకెళ్లింది. ఐఎన్‌ఎక్స్ మీడియా అవినీతి కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) అరెస్టు చేసిన తరువాత 74 ఏళ్ల చిదంబరం తీహార్ జైలుకు వచ్చి నెల రోజులకు పైగా అయిపోయింది. చిదంబరంను కస్టడీలోకి తీసుకొని విచారించడానికి ఈడీకి అనుమతివ్వడంతో పాటు, ఆయనకు ఇంటి నుంచి భోజనం, ఔషధాలు తెప్పించుకోవడానికి అనుమతిచ్చింది.
అలాగే, ఆయనకు ప్రత్యేక గది, వెస్టర్న్ టాయిలెట్ సౌకర్యం కల్పించాలని ఆదేశించింది. ఎయిర్‌కండీషనింగ్ సౌకర్యం కావాలన్న చిదంబరం విజ్ఞప్తిని ఈడీ వ్యతిరేకించింది. ఈడీ గురువారం చి దంబరంను ఢిల్లీలోని తన కార్యాలయానికి తీసికెళ్లింది. గురువారం రాత్రి అతడిని తుగ్లక్ రోడ్ పోలీసు స్టేషన్ లేదా తిలక్ మార్గ్ పోలీసు స్టేషన్‌లో ఉంచుతుంది. శుక్రవారం ఉదయం 10.30 గంటలకు తిరిగి తన కార్యాలయానికి తీసుకొస్తుంది. ‘ఆయన భద్రత కోసం మేము జాగ్రత్తలు తీసుకుంటాం. ఇంటి భోజనం, కుటుంబ సభ్యుల సందర్శనకు అవకాశమిస్తాం. వెస్టర్న్ టాయిలెట్ సౌకర్యం కల్పిస్తాం’ అని ఈడీ న్యాయస్థానానికి చెప్పింది. ఐఎన్‌ఎక్స్ మీడియా అవినీతి కేసులో సీబీఐ చిదంబరంను ఆగస్టు 21న అరెస్టు చేసింది. జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా ఆయన సెప్టెంబర్ అయిదో తేదీ నుంచి తీహార్ జైలులో ఉన్నారు.