క్రైమ్/లీగల్

కొత్త భవనాలనూ కూల్చేస్తారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 16: తెలంగాణ సచివాలయం కూల్చివేతపై సాంకేతిక నిపుణుల కమిటీ నివేదికను ప్రభుత్వం బుధవారం నాడు హైకోర్టుకు సమర్పించింది. సాంకేతిక నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక అసంపూర్ణంగా ఉందని, కొత్త సచివాలయం ఎందుకు నిర్మించాలో సకారమైన కారణాలను పేర్కోలేదని హైకోర్టు పేర్కొం ది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, జస్టిస్ అన్నిరెడ్డి అభిషేక్ రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం సచివాలయం కూల్చివేత ప్రజావాజ్య పిటిషన్‌పై విచారణ కొనసాగించింది. ఈ అంశంపై ఉన్నతన్యాయస్థానం అనేక ప్రశ్నలు సంధించింది. సాంకేతిక కమిటీ తన నివేదికపై బుర్రపెట్టలేదని, ఇలా అంటున్నందుకు విచారిస్తున్నానని ప్రధాన న్యాయమూ ర్తి జస్టిస్ చౌహాన్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ జే రామచందర్‌రావు వివరణ ఇచ్చారు. ప్రస్తుత భవనాలు మరమ్మతులు చేయలేని స్థితిలో ఉన్నట్టు సాంకేతిక కమిటీ నివేదికలో పేర్కొందని అదనపు ఏజీ పేర్కొన్నారు. గత నాలుగేళ్లలో మూడు అగ్ని ప్రమాదాలు జరిగాయని ఆయన చెప్పారు. అధికారులు, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులతో సమావేశాలు నిర్వహించేందుకు కనీసం 500 మంది కూర్చునేలా కాన్ఫరెన్స్ హాలును కూడా నిర్మించాల్సి ఉందని ఆయన చెప్పారు. మరమ్మతులు చేసి సరిదిద్దే అవకాశం ఉన్న భవనాలను సైతం కూల్చాలనుకోవడం ఆశ్చర్యంగా ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఏడేళ్ల కిందట నిర్మించిన హెచ్ బ్లాక్‌ను కూల్చిల్సిన అవసరం ఏమిటని న్యాయస్థానం ప్రశ్నించింది. గతంలో అగ్నిప్రమాదాలు కూడా జరిగాయని, మళ్లీ అలాంటి పరిస్థితి తలెత్తితే అగ్నిమాపక వాహనాలు అక్కడికి వెళ్లేందుకు కూడా అవకాశం లేదని ప్రభుత్వం పేర్కొంది. ఈ నేపథ్యంలోనే అన్ని శాఖలూ ఒకే దగ్గరకు ఉండేలా కొత్త సచివాలయ నిర్మాణం చేపట్టాలని కేబినెట్ నిర్ణయించినట్టు పేర్కొంది. కొత్త సచివాలయ విస్తీర్ణం, నమూనా వివరాలను అందించాలని హైకోర్టు సూచించగా, ఇంకా నమూనా ఖరారు కాలేదని ప్రభుత్వం తెలిపింది. సుమారు 10లక్షల చదరపు అడుగుల్లో నిర్మిస్తామని పేర్కొంది. ‘ప్రస్తు తం 9.16 లక్షల చదరపు అడుగుల భవనాలు అందుబాటులో ఉన్నాయి కదా...కొత్తగా మీరు అదనంగా నిర్మిస్తున్నది ఏమిటి?’ అని హైకోర్టు ప్రశ్నించింది. భవనాలను కూల్చివేయకుండానే లోపాలు సరిదిద్దుకోవచ్చు కదా అని ప్రధాన న్యాయమూర్తి అడిగారు. కేబినెట్ చేసిన తీర్మానంలోనూ, సాంకేతిక నిపుణుల కమిటీ నివేదికలోనూ భవనాలు కూల్చివేత అంశం ప్రస్తావనే లేదు, అలాంటపుడు అధికారులు ఏకపక్షంగా భవనాలను ఎలా కూల్చివేస్తారని హైకోర్టు ప్రశ్నించింది. ముఖ్యమంత్రి కార్యాలయం ఉన్న సీ బ్లాక్ నుండి హెలిప్యాడ్ చాలా దూరంగా ఉందని ప్రభుత్వం వాదించగా, పిటిషనర్ తరఫున న్యాయవాది మాత్రం హెలిప్యాడ్
సీ బ్లాక్‌కు కేవలం 300 మీటర్ల దూరంలోనే అందుబాటులో ఉందని చెప్పారు. కొత్త భవనం వల్ల ప్రభుత్వంపై వెయ్యికోట్ల భారం పడుతుందని ఆయన వివరించారు. తాము ఇంజనీర్లం కాదని సాంకేతిక నిపుణుల కమిటీ నివేదికను ప్రశ్నించలేమని, ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయం చట్టవిరుద్ధం ఎలా అవుతుందో పిటిషనర్ తన వాదనలు వినిపించాలని ధర్మాసనం పేర్కొంది. ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయాల్లో కోర్టులు జోక్యం చేసుకోకూడదని ప్రభుత్వం తరఫున అదనపు ఏజీ వాదించారు. ప్రభుత్వ నిర్ణయం చట్టవిర్ధుంగా ఉందా అని పిటిషనర్‌ను హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమీక్షించే అధికారం ఉన్నత న్యాయస్థానానికి ఉందని పిటిషనర్ రేవంత్‌రెడ్డి తరఫున న్యాయవాది టీ రజనీకాంతరెడ్డి తెలిపారు. దీనిపై ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 21వ తేదీకి వాయిదా వేసింది.