క్రైమ్/లీగల్

ఏడుగురు దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మారేడుమిల్లి, అక్టోబర్ 15: తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతం మారేడుమిల్లి ఘాట్‌రోడ్డులో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. టెంపోట్రావెలర్ వాహనం అదుపుతప్పి ఘాట్ రోడ్డు పైనుండి 20 అడుగుల దిగువకు పడిపోవడంతో ఏడుగురు దుర్మరణం చెందారు. ఆరుగురు ఘటనాస్థలిలోనే మృతిచెందగా, మరో మహిళ ఆసుపత్రికి తరలిస్తుండగా మృతిచెందింది. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన వీరంతా పుణ్యక్షేత్రాల దర్శనం నిమిత్తం వచ్చారు. భద్రాచలం నుండి తూర్పు గోదావరి జిల్లా అన్నవరం వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. వివరాలిలావున్నాయి... కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గం జిల్లా చలికేరు, మకడశిర గ్రామాలకు చెందిన పలువురు తీర్థయాత్ర నిమిత్తం ఈనెల 12వ తేదీన అనంతపురం జిల్లాకు చేరుకున్నారు. అక్కడి నుండి రెండు టెంపో ట్రావెలర్ వ్యానుల్లో బయలుదేరిన వీరు పలు దేవాలయాలను దర్శించుకుని సోమవారం శ్రీశైలం చేరుకున్నారు. అనంతరం భద్రాచలం చేరుకున్న
వీరంతా అక్కడ దర్శనం అనంతరం మంగళవారం ఉదయం తూర్పు గోదావరి జిల్లా అన్నవరం బయలుదేరారు. ఒక వ్యాను ముందు వెళ్లిపోగా, వెనక వస్తున్న వ్యాను (ఏపి16 టీడీ 6849) మారేడుమిల్లి మండలంలోని వాలీసుగ్రీవుల కొండ వద్ద ప్రమాదకర మలుపులో అదుపుతప్పి బోల్తాపడింది. మలుపులుగా ఉండే ఈ ఘాట్ రోడ్డులో 30 అడుగుల దిగువన అదే రోడ్డుపైకి వ్యాను పడిపోయింది. ఈ ధాటికి వ్యాను తునాతునకలయ్యింది. ఈ ప్రమాదంలో కుంభం రమేష్ (56), కుంభం అమృతవాణి (53) దంపతులు, మేడా శ్రీనివాసులు(62), మేడా గాయిత్రి (52), మేడా శే్వత (25), మేడా మధురాక్షమ్మ (58) అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన రామలక్ష్మి (42) అనే మహిళ రంపచోడవరం ఆసుపత్రికి తరలిస్తుండగా మృతిచెందింది. ప్రమాద సమాచారం అందుకున్న మారేడుమిల్లి ఎస్సై డి రామకృష్ణ సిబ్బందితో హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని, గాయపడిన వారిని మారేడుమిల్లి పీహెచ్‌సీ అంబులెన్సులో రంపచోడవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరిలో కురిడి శే్వత పరిస్థితి విషమంగా ఉండటంతో కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కురిడి శ్రీనివాసులు, వెంకట చలపతి, గీతాలక్ష్మి, జగన్నాథ్ రంపచోడవరం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వ్యాను డ్రైవరు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
రంపచోడవరం ఐటీడీఏ పీవో నిషాంత్‌కుమార్, ఏఎస్పీ వకుల్ జిందాల్, ఓఎస్డీ హాసిబ్, సబ్-కలెక్టర్ ప్రవీణ్ ఆదిత్య సంఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించారు. తూర్పు గోదావరి జిల్లా జిల్లా ఎస్పీ అద్నాన్ నరుూం అస్మీ రంపచోడవరం ప్రభుత్వాసుపత్రికి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించి ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య రంపచోడవరంలో క్షతగ్రాతులను పరామర్శించారు.

*చిత్రం... ఘటనా స్థలంలో చెల్లాచెదురుగా పడివున్న మృతదేహాలు