క్రైమ్/లీగల్

ప్రఫుల్ పటేల్‌కు ఈడీ సమన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 15: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు అత్యంత సహచరుడైన దివంగత ఇక్బాల్ మిర్చి అక్రమ ఆస్తుల వ్యవహారంలో మనీ లాండరింగ్‌కు పాల్పడిన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎన్‌సీపీ నేత, మాజీ కేంద్ర మంత్రి ప్రఫుల్ పటేల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. యూపీఏ హయాంలో కేంద్ర మంత్రిగా వ్యవహరించిన ప్రఫుల్‌పటేల్‌ను ఈనెల 18న విచారించనున్నట్లు ఈడీ వర్గాలు మంగళవారం తెలియజేశాయి. పటేల్‌తో పాటు ఆయన భార్య, ఇక్బాల్ మిర్చి భార్యల పేరుతో నడుస్తున్న రియల్ ఎస్టేట్ కంపెనీ వ్యవహారంలో మనీలాండలింగ్ చట్టం కింద పటేల్ వాంగ్మూలాన్ని రికార్డు చేయనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. విమానయాన రంగంలో మనీలాండరింగ్‌కు సంబంధించిన మరో కేసులో ఇప్పటికే ప్రఫుల్ పటేల్‌ను విచారించినట్లు చెప్పారు. ఈడీ అధికారుల కథనం మేరకు.. పటేల్‌కు చెందిన మిలీనియం డెవలపర్స్ ప్రైవేటు లిమిటెడ్ ‘సీజే హౌస్’ పేరుతో 2006-07 భారీ భవనాన్ని నిర్మించింది. ఇందులో మూడు, నాలుగు అంతస్థులను ఇక్బాల్ మిర్చి భార్య హజ్రా ఇక్బాల్‌కు పటేల్ బదిలీ చేశారు. ఈ భవనానికి సంబంధించిన మొత్తం స్థలం ఇక్బాల్ పేరుతో ఉంది. మనీలాండరింగ్, డ్రగ్స్ అక్రమ రవాణా, దోపిడీలకు పాల్పడి స్థలాన్ని పొందినట్లు ఆరోపణలున్నాయి. అయితే, ఈడీ వాదనలను ప్రఫుల్ వర్గాలు తీవ్రంగా ఖండించాయి. ఆస్తులకు సంబంధించిన కీలక పత్రాలున్నాయనీ.. ఇందులో ఎలాంటి అపవాదులకు ఆస్కారం లేదని పూర్తిగా పారదర్శకంగానే వ్యవహరించామని ప్రఫుల్ పటేల్ వర్గాలు చెప్పాయి. 2013లో లండన్‌లో మృతి చెందిన ఇక్బాల్ మిర్చి అనుచరులు ఇద్దరిని ఇటీవలే ఈడీ అరెస్టు చేసి ప్రశ్నిస్తోంది.