క్రైమ్/లీగల్

సీఎంఓకు ఎవరూ ఫోన్ చేయలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 14: తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం హెల్ప్‌లైన్‌కు ఒక వ్యక్తి ఫోన్ చేసి ఆర్టీసీ సమ్మె పట్ల సీఎంను నిందించినట్టు పత్రికల్లో, చానల్స్‌ల్లో, సోషల్ మీడియాలో ప్రచురితమైన, ప్రసారమైన వార్తల్లో వాస్తవం లేదని సీఎంఓ అధికారులు ఖండించారు. వైరల్ అయిన ఆడియో ఫేక్‌గా పేర్కొన్నారు. ఈమేరకు ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు సోమవారం నగర పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఫేక్ ఆడియోకు బాధ్యులైన వారిపై చర్య తీసుకోవాలని, తప్పుడు ప్రచారం ఆపాలని ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు ఫిర్యాదులో పేర్కొన్నారు.