క్రైమ్/లీగల్

ఏఐసీసీ కార్యాలయ సిబ్బంది ఇళ్లపై ఐటీ దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : ఢిల్లీ ఆదాయం పన్ను అధికారులు సోమవారం అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో ఖాతాలు (అకౌంట్స్) నిర్వహించే పలువురు సిబ్బంది ఇళ్లలో సోదాలు నిర్వహించి విలువైన పత్రాలు, నగదును స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ ఆదాయం పన్ను అధికారులతోపాటు కేంద్ర ఆర్థిక శాఖలోని విజిలెన్స్ విభాగం అధికారులు కూడా ఈ సోదాల్లో పాల్గొనట్లు తెలిసింది. ఆదాయం పన్ను అధికారులు సోమవారం ఏఐసీసీ ముఖ్య అకౌంటెంట్ ఎంఎం మొయిన్ ఇంటిలో జరిపిన సోదాల్లో ఏఐసీసీ కోశాధికారి, రాజ్యసభ సభ్యుడు అహమద్ పటేల్‌తో కలిసి దిగిన పోటోలు లభించినట్లు చెబుతున్నారు. ఈ ఫోటోలు నిజమైతే అహమద్ పటేల్‌తోపాటు ఏఐసీసీ సీనియర్ నాయకులపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. మహారాష్ట్ర, హర్యానా శాసనసభ ఎన్నికలు ఈ నెల 21న జరగనున్న సమయంలో ఏఐసీసీ అకౌంట్స్ విభాగంపై ఆదాయం పన్ను అధికారులు దాడులు జరపరటం గమనార్హం. ఎంఎం మొయిన్ గత ఏప్రిల్, మే నెలల్లో దాదాపు ఇరవై కోట్ల నల్లధనాన్ని హవాలా ద్వారా ఏఐసీసీ కార్యాలయానికి తెచ్చినట్లు ఆదాయం పన్ను శాఖ అధికారులు చెబుతున్నారు. గత లోక్‌సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ తాము అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, రాజస్థాన్, పంజాబ్ తదితర రాష్ట్రాల్లో ముఖ్యంగా మధ్యప్రదేశ్‌లో పెద్దఎత్తున నల్లధనాన్ని సేకరించి హవాలా ద్వారా ఈ డబ్బును పార్టీ ఆభ్యర్థులకు పంపిణీ చేయటంతోపాటు కొంత మొత్తాన్ని ఏఐసీసీ కార్యాలయానికి తరలించారని ఆదాయం పన్ను శాఖ అధికారులు చెబుతున్నారు. ఆదాయం పన్ను శాఖకు చెందిన దాదాపు 300 మంది అధికారులు కేరళ, మధ్యప్రదేశ్‌తోపాటు నాలుగు రాష్ట్రాల్లోని 52 ప్రదేశాల్లో దాడులు చేసి పత్రాలు, నల్లధనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు చెబుతున్నారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ సన్నిహితుల ఇళ్లపై కూడా ఆదాయం పన్ను శాఖ అధికారులు దాడులు చేసినట్లు తెలిసింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనకు సంబంధించిన పత్రాలు, సమాచారాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించిన ఆదాయం పన్ను శాఖ అధికారులు పలు యూఎస్‌బీలు, హార్డ్‌డ్రైవ్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను నిపుణుల పరిశీలనకు పంపించారు. దేశ రాజధాని ఢిల్లీలోని 24 అక్బర్ రోడ్డులో ఉన్న ఏఐసీసీ కార్యాలయంలోని అకౌంట్స్ విభాగంలో పని చేసే నలుగురు సిబ్బందిని అదాయం పన్ను శాఖ అధికారులు తమ వెంట తీసుకుపోయినట్లు తెలిసింది.