క్రైమ్/లీగల్

నైజీరియన్ ముఠా అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గచ్చిబౌలి, అక్టోబర్ 12: విదేశాల్లో ఉద్యోగాల పేరుతో మోసాలు చేసే ముఠాల పట్ల అప్రమత్తంగా ఉండాని పోలీసులు ఎన్ని రాకలుగా హితబోధ చేస్తున్న ప్రజల్లో మార్పు రావడం లేదు. నిరుద్యోగులు ఉద్యోగం కోసం మోసపోయారను కుంటే పర్వలేదు. అక్షరాసులు నిరక్ష్యరాసులు అనే తేడాలేదు. ఉన్నత చదువులు చదువుకున్న వారు మోసపోతున్నారు. నగరానికి చెందిన వ్యక్తి విదేశాల్లో ఉద్యోగం కోసం రూ. 47 లక్షల రూపాయలు పోగోట్టుకున్నాడు. ఇదేదో చదువు రాని నిరక్ష్యరాసుడిని మోసం చేశారను కుంటే పప్పులో కాలేసినట్టే. ఒరిస్సాలో మంచి పేరున్న స్టీల్ కంపెనీకి సీఈఓగా వ్యవహరిస్తున్న అధికారికి రూ.47లక్షల రూపాయలు నైజీరియా ముఠా కూచ్చిటోపి పెట్టింది. విదేశాల్లో ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠాలో ముగ్గురు నైజీరియన్లతో పాటు వారికి సహకరించిన నాగాలాండ్‌కు చెందిన మహిళను సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 11లక్షల రూపాయల నగదు స్వాధినం చేసుకోవడంతో పాటు 21 సెల్ ఫోన్లు, 4 పాస్ పోర్టులు, 6 డెబిట్ కార్డులు, 10 విదేశీ సిమ్ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సీపీ వీసీ సజ్జనార్ తెలిపారు. సైబరాబాద్ కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠాకు సంబంధించిన వివరాలను కమిషనర్ వీసీ సజ్జనార్ వెల్లడించారు. ఒరిస్సాలోని పట్నాయక్ స్టీల్ కంపెనీకి సీఈఓ పని చేస్తున్న రాజన్ బాబు కుక్కట్‌పల్లిలో నివాసముంటున్నారు. రాజన్ బాబు కేంద్ర ప్రభుత్వనికి చెందిన డిపార్ట్‌మెంటు ఆఫ్ ఆటోమోటిక్ ఎనార్జీలో పని చేసి విఆర్‌ఎస్ తీసుకుని గత మూడు సంవత్సరాలుగా పట్నాయక్ సంస్థలో పని చేస్తున్నారు. బా బుకి మరితం మంచి కంపెనీల్లో చేరాలని ఆశతో తనకున్న అనుభవంతో పాటు ఏడు దేశాలు తిరిగి రావడాన్ని జోడించి ప్రొఫైల్స్‌లో అప్‌లోడ్ చేస్తుంటాడు. 2019 జనవరిలో రాజన్ బాబుకి విలియమ్స్ అనే వ్యక్తి ఫోన్ చేసి తను కాలిఫోర్నియాలోని రోగల్ హోటల్స్ అండ్ అపార్ట్‌మెంట్స్ సీఈఓనని పరిచయం చేసుకున్నాడు. ప్రొఫైల్ పరిశీలించామని రోగల్ సంస్థ చీఫ్ మేనేజర్‌గా ఎంపిక చేసినట్లు చెప్పి ఫిజికల్ ఇంటర్యూ పేరుతో ప్రశ్నలు అడిగినట్లు నమ్మించారు. కొన్ని రోజుల తరువాత మిసేస్ విలియమ్స్ ఇండియాకు వచ్చానని టెలిఫోన్‌లో ఇంటర్యూ తీసుకుంటానని చెప్పి నమ్మించింది. అనంతరం తమ సంస్థ 12 నెలల జీతం అడ్వాన్స్‌గా లక్ష 75వేల యూఎస్ డాలర్ల కోటిన్నర రూపాయలు ఇవ్వన్నుట్లు తెలిపింది. ముందు 55 వేల రూపాయలు చేల్లిస్తే చెక్ క్లీయర్ చేయన్నుట్లు చెప్పింది. కొద్ది రోజుల తరువాత సదరు మహిళ ఫోన్ చేసి మరో రెండున్నర లక్షలు, పది లక్షల రూపాయలు చేల్లించాలని చెప్పాడంతో పాటు మొత్తం రూ.47 లక్షలు తీసుకున్నారు. వివిధ పేర్లతో డబ్బులు లాగేందుకు ప్రయత్నించడంతో అనుమానం వచ్చి సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నైజీరియాకు చెందిన మహమ్మద్ (35) మూస హాలిమత్ (29) నడోర్ అలియోనే (32)తో పాటు నాగాలాండ్‌కు చెందిన హోలిటో జహిమోమి (35)అను అరెస్టు చేయగా పెటోసిలి య్గూహ, సంసాన్ విలియమ్స్‌లు పరారీలో ఉన్నట్లు సీపీ తెలిపారు. నోయిస్ డోనాల్డ్ గతంలో పలు సైబర్ కేసులో నిందితుడని నైజీరియాకు వెళ్లి మహమ్మద్‌గా పేరు మార్చుకోని ఇండియాకు వచ్చినట్లు వివరించారు. మహమ్మద్ జహిమోమి నైజీరియాలో వివా హం చేసుకుని ఇక్కడకు వచ్చి మోసాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. ముఠాలోని అలియోనే నకిలీ ఫేస్ బుక్‌లు ఈ మెయల్స్ సృష్టించడంలో నేర్పరని చెప్పిన సీపీ, ఫేస్‌బుక్ ఖాతాలకు చెందిన వేలాది ఫోటోలను సేకరించి మోసాలు చేస్తున్నరని అన్నారు. విదేశాలకు వెళ్ళాలను కోనే వారి వివరాలను సేకరించి మెయిల్స్ చేయడంతో పాటు ఫోన్ చేసి మోసాలకు పాల్పడుతున్నట్లు సీపీ వివరించారు. కెనాడాలో మీకు మంచి ఉద్యోగం ఉందని మేనేజర్లుగా, సీఈఓలు ఎంపికైనట్లు నమ్మించి లక్షల రూపాయలు కాజేస్తున్నట్లు వివరించారు. ఫోన్‌లో ఇంటర్వూలు చేసినట్లు నమ్మించి మోసాలకు పాల్పడుతున్నారని సజ్జనా ర్ చెప్పారు. ముంబాయికి చేందిన ఒక వ్యక్తి నుండి ఈ ముఠా కోటిన్నర మోసం చేయడం జరిగిందని తము కేసు దర్యాప్తు చేస్తున్న సమయంలో నిందితుల ఫోన్‌లో ఉన్న నెంబర్లను పరిశీలిస్తుండగా కేసు వెలుగులోకి వచ్చిందని తెలిపారు. కోటిన్నర చేల్లించిన వ్యక్తికి తమ నిందితులను అరెస్టు చేసినట్లు తము చెప్పెవరకు మోసపోయిన విషయం తెలియదని అన్నారు. బ్యాక్ డోర్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తమనే ప్రకటనలపై అప్రమత్తంగా ఉండాలని బహుళ జాతీ సంస్థలు డబ్బులు తీసుకుని ఉద్యోగాల్వివని తెలిపారు. కారక్రమంలో క్రైం డీసీపీ రోహిణి ప్రియదర్శి, సైబర్ క్రైం ఏసీపీ శ్రీనివాస కుమార్, సీఐలు రామయ్య, శ్రీనివాస్, ఎస్‌ఐలు రాజేందర్, విజయ వర్ధన్ పాల్గొన్నారు. నిందితులను అరెస్టు చేసిన సైబర్ క్రైం పోలీసులకు నగదు రివార్డులను అందించారు.