క్రైమ్/లీగల్

‘మేఘా’లో ఐటీ సోదాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 11: పోలవరం ప్రధాన డ్యాం రివర్స్ టెండరింగ్‌లో ఏకైక బిడ్ వేసి కాంట్రాక్టు దక్కించుకున్న మేఘా ఇంజనీరింగ్ ఇన్‌ఫ్రాస్టక్చర్స్ లిమిటెడ్ సంస్థ అధినేత మేఘా కృష్ణారెడ్డి నివాసం, కార్యాలయాల్లో ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ఐటీ అధికారులు ఇంకా ఈ సోదాలు కొనసాగిస్తున్నారు. ఇటీవల చేపట్టిన కాంట్రాక్టుల్లో వచ్చిన లాభాలకు సంబంధించిన లెక్కలు సరిగ్గా చూపలేదన్న కారణంతో ఈ సోదాలు జరిగినట్లు సమాచారం. ఈ సోదాలకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించేందుకు ఐటీ అధికారులు నిరాకరించారు. దేశ వ్యాప్తంగా 30 చోట్ల ఉన్న ఈ కంపెనీకి సంబంధించిన కార్యాలయాల్లో అధికారులు తనిఖీలు చేపట్టినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని బాలానగర్ కార్యాలయం, జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు కార్యాలయం, ఎంసీహెచ్‌ఆర్‌డీ సమీపంలోని మేఘా సంస్థ అధినేత కృష్ణారెడ్డి ఇంట్లో కూడా ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. ఐటీ అధికారులు పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్టు భోగట్టా. కాగా, ఐటీ అధికారులు ప్రతి రెండేళ్లకు ఒకసారి సోదాలు చేయడం సర్వసాధారణమేనని, ప్రస్తుతం తనిఖీలు జరుగుతున్నాయని మేఘా సంస్థ పేర్కొంది.