క్రైమ్/లీగల్

‘నన్నయ’ ప్రొఫెసర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, అక్టోబర్ 11: ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలోని ఆంగ్ల విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న నిమ్మగడ్డ సూర్య రాఘవేంద్రపై లైంగిక వేధింపుల ఆరోపణలొచ్చాయి. ప్రొఫెసర్ తమను లైంగికంగా వేధిస్తున్నారని ఆరోపిస్తూ ముగు గరు విద్యార్థినులు నేరుగా ఉన్నత విద్యాశాఖకు ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. ఉన్నత విద్యాశాఖ ఆదేశాలతో ఈ ఆరోపణలపై విచార ణ జరుపుతున్నారు. ఈ ఆరోపణలపై నిజ నిర్ధారణ కమిటీని నియమించి, ప్రాథమిక నివేదికను శుక్రవారం సాయంత్రం ఉన్నత విద్యాశాఖకు నివేదించారు. అయితే బాధిత విద్యార్థినులు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి కూ డా లేఖ రాసినట్టు సమాచారం. తరగతులు పూర్తయిన తర్వాత స్పెషల్ క్లాసుల కోసమం టూ తన ఫ్లాట్‌కు రావాలని ప్రొఫెసర్ బలవం తం చేస్తున్నారని, ఈ విషయం ఎవరికైనా చెబితే ప్రాజెక్టులు ఆపేస్తానని, పాస్ కాకుండా చేస్తానని బెదిరించేవాడని విద్యార్థినులు ఫిర్యాదులో పేర్కొన్నట్టు సమాచారం. కాగా, ప్రాథమిక విచారణ నివేదికను ఉన్నత విద్యా శాఖ కు నివేదించినట్టు యూనివర్సిటీ అధికారులు తెలిపారు. మరికొన్ని రోజుల్లో పూర్తిస్థాయి నివేదిక అందిస్తారని సమాచారం.