క్రైమ్/లీగల్

నకిలీ నక్సలైట్ల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచిర్యాల, అక్టోబర్ 11: తుపాకులతో వసూళ్లకు పాల్పడుతున్న ముగ్గురు నకిలీ నక్సలైట్లను అరెస్టు చేసినట్లుగా రామగుండం పోలీసు కమిషనర్ సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం జైపూర్ ఏసిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మావోయిస్టు పార్టీ యాక్షన్ టీమ్ రణధీర్ కమాండర్ పేరుతో నకిలీ నక్సలైట్లు ఒక లెటర్, ఒక బుల్లెట్‌ను కవర్‌లో పెట్టి నర్వ సర్పంచ్ రాజ్‌కుమార్‌కు పంపించినట్లుగా తెలిపారు. లెటర్‌తో పాటు బుల్లెట్ కూడా పంపడంతో భయబ్రాంతులకు గురై పోలీసువారికి సమాచారం ఇవ్వగా జైపూర్, టాస్క్ఫోర్స్ పోలీసులు బెదిరింపులకు పాల్పడుతున్న వారిని చెన్నూర్ క్రాస్ రోడ్డు వద్ద నకిలీ నక్సలైట్లను పట్టుకున్నట్లుగా తెలిపారు. వేమనపల్లి మండలం నీల్వాయికి చెందిన బొమ్మ చంద్రశేఖర్ రెడ్డి, మంగినపల్లి నవీన్ రెడ్డి, చెన్నూర్ పట్టణంలోని ఆదర్శనగర్‌కు చెందిన తోడె రాజేశ్వర్ రెడ్డిని అరెస్టు చేసి వారి వద్ద నుండి ఒక పిస్తోలు, ఎనిమిది బుల్లెట్లను స్వాదీనం చేసుకున్నట్లు వివరించారు.
నవీన్ రెడ్డి బీహార్ రాష్ట్రంలోని పాట్నా ఎన్ ఐటి యూనివర్సిటీలో ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. అక్కడే గుర్తు తెలియని వ్యక్తి వద్ద నుండి తోడె రాజేశ్వర్ రెడ్డి, నవీన్ రెడ్డిలు కలసి రూ.32వేలకు తుపాకీ కొనుగోలు చేశారు. తొమ్మిది బుల్లెట్లను రూ.8వేలు చెల్లించి మరల పాట్నా వెళ్లి తీసుకువచ్చినట్లుగా నిందితులు తెలిపారు. డబ్బులు ఉన్నవారి జాబితా తయారు చేసుకున్నారు. జైపూర్ మండలం నర్వ గ్రామానికి సర్పంచ్‌గా రాజ్‌కుమార్ ఎన్నికయ్యాడు. అతని స్థిరాస్తులు ఎక్కువగా ఉన్నాయని తెలుసుకొని అతన్ని నక్సలైట్ పేరుతో బెదిరింపులకు పాల్పడితే డబ్బులు ఇస్తాడని ప్లాన్ చేసి వెంకటేష్ నేత సైన్యం అనే వాట్సాప్ గ్రూప్ నుండి సర్పంచ్ రాజ్‌కుమార్ నంబర్ సేకరించి బెదిరించడం జరిగింది. తుపాకీ గూర్చి విచారించగా తోడె రాజేశ్వర్‌రెడ్డి చెన్నూర్‌లో తన ఇంట్లో ఉంది అని చెప్పగా అతని వద్ద నుండి తుపాకీ స్వాదీనం చేసుకోవడం జరిగిందని వివరించారు. నవీన్ రెడ్డి బీహార్ రాష్ట్రంలోని ఇంజినీరింగ్ పూర్తి చేసి ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్నాడు. చంద్రశేఖర్ రెడ్డి సైతం హైదరాబాద్‌లోనే బేకరీ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. తోడేటి రాజేశ్వర్ రెడ్డి ఫైనాన్స్, వైన్స్ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. ముగ్గురు బంధువులు కావడంతో ఒక ముఠాగా ఏర్పడి సులభంగా డబ్బులు సంపాదించుకునే ప్రయత్నంలో భాగంగా ఆయుధాలతో బెదిరిస్తూ సొమ్ము చేసుకోవడం వారికి అలవాటుగా మారింది. మద్యంతో పాటు ఇతర జల్సాలకు అలవాటుపడి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించుకునేందుకు ఈ మార్గాన్ని ఎంచుకొని నకిలీ నక్సలైట్ పేరుతో వ్యాపారస్తులు, కాంట్రాక్టర్లను, రాజకీయ నాయకులను బెదిరించాలనే ప్రయత్నం చేశారు. మావోయిస్టు పార్టీకి రూ.5లక్షలు ఇవ్వకుంటే చంపేస్తామని సర్పంచ్‌రాజ్‌కుమార్‌ను బెదిరించినట్లు తెలిపారు.
ఎలాంటి బెదిరింపులకు భయపడవద్దు
మావోయిస్టు, మరే ఇతర పేర్లతో భయపెట్టేవారికి భయపడి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదని సిపి సత్యనారాయణ అన్నారు. పోలీసులు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటూ ప్రజల రక్షణే ధ్యేయంగా పనిచేస్తుంటారని తెలిపారు. బెదిరింపులకు పాల్పడేవారు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదన్నారు. వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. నిందితులను సకాలంలో గుర్తించి వారి వద్ద నుండి తుపాకీ, బుల్లెట్లను స్వాదీనం చేసుకోవడంలో ప్రతిభ కనబరిచిన అధికారులు, సిబ్బందిని అభినందించారు.