క్రైమ్/లీగల్

చిదంబరంను హాజరుపరచండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 11: కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పి.చిదంబరంను సోమవారం తన ముందు హాజరు పరచవలసిందిగా ఢిల్లీ కోర్టు శుక్రవారం తీహార్ జైలు అధికారులను ఆదేశించింది. కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) నమోదు చేసిన ఐఎన్‌ఎక్స్ మీడియా అవినీతి కేసులో అరెస్టయిన చిదంబరం ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు. అయితే, ఐఎన్‌ఎక్స్ మీడియా మనీలాండరింగ్ కేసులో దర్యాప్తు సంస్థ అయిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చిదంబరంను తన కస్టడీకి అప్పగించాలని పిటిషన్ దాఖలు చేసింది. ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌పై నిర్ణయం తీసుకోవడానికి వీలుగా నిందితుడు చిదంబరంను అక్టోబర్ 14వ తేదీ (సోమవారం) మధ్యాహ్నం 3గంటలకు తన ముందు హాజరు పరచవలసిందిగా ప్రత్యేక న్యాయమూర్తి అజయ్ కుమార్ కుహర్ తీహార్ జైలు అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించి ఆయన శుక్రవారం చిదంబరంకు వ్యతిరేకంగా ‘ప్రొడక్షన్ వారెంట్’ కూడా జారీ చేశారు. విదేశాలలో ఉన్న కొన్ని షెల్ కంపెనీలు, 17 బ్యాంకు ఖాతాలకు సంబంధించిన సమాచారాన్ని చిదంబరం నుంచి రాబట్టడానికి అతడిని ఈడీ కస్టడీలోకి తీసుకొని విచారించాల్సిన అవసరం ఉందని ఈడీ తరపున వాదిస్తున్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ అమిత్ మహాజన్ శుక్రవారం కోర్టును కోరారు. ఈడీ అవసరమయిన సమయంలో చిదంబరం కస్టడీని కోరుతానని చెప్పడం వల్ల మనీలాండరింగ్ కేసులో ఈడీ ముందు లొంగిపోతానని చిదంబరం పెట్టుకున్న పిటిషన్‌ను ప్రత్యేక కోర్టు ఇంతకు ముందు కొట్టివేసింది.