క్రైమ్/లీగల్

అమిత్ షాపై ఆరోపణల కేసు రాహుల్‌కు బెయిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అహ్మదాబాద్, అక్టోబర్ 11: రెండు వేర్వేరు ఘటనల్లో పరువు నష్టం కేసును ఎదుర్కొంటున్న కాంగ్రెస్ నాయకుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ శుక్రవారం అహ్మదాబాద్‌లోని అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టుకు హాజరయ్యారు. హోం మంత్రి అమిత్ షాను ‘హంతకుడు’గా అభివర్ణించిన నేపథ్యంలో రాహుల్‌పై పరువు నష్టం కేసు దాఖలైన సంగతి తెలిసిందే. అలాగే, 2016లో పెద్ద నోట్ల రద్దు అనంతరం బ్యాంకు నగదు లావాదేవీల వ్యవహారంలో కుంభకోణానికి పాల్పడిందని చేసిన ఆరోపణలపై కూడా మరో కోర్టు ఎదుట రాహుల్ హాజరయ్యారు. ఈ రెండు పరువు నష్టం దావా కేసుల్లోనూ తాను ‘నిర్దోషి’నేని కోర్టులకు తెలియజేశారు. రాహుల్ వ్యక్తిగత హాజరుకు సంబంధించి శాశ్వత మినహాయింపు ఇవ్వాలని ఆయన తరఫు న్యాయవాదులు కోర్టుకు వివరించారు. అమిత్‌షాను ‘హత్య కేసులో నిందితుడు’ అని రాహుల్ చేసిన ఆరోపణలపై స్థానిక బీజేపీ కార్పొరేటర్ కృష్ణవర్దన్ బ్రహ్మభట్ పరువు నష్టం దావా వేశారు. ఈ కేసులో రాహుల్‌కు పదివేల రూపాయిల బాండ్‌తో బెయిల్‌ను కోర్టు మంజూరు చేసింది. రాహుల్ వ్యక్తిగత హాజరుపై శాశ్వత మినహాయింపు పిటిషన్‌పై డిసెంబర్ ఏడో తేదీన విచారించనున్నట్లు మెజిస్ట్రేట్ ఆర్‌బీ ఇటాలియా స్పష్టం చేశారు. జబల్‌పూర్‌లో జరిగిన లోక్‌సభ ఎన్నికల ర్యాలీలో ‘హంతకుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అమిత్‌షా.. ఏ విధంగా అద్భుతాలు సృష్టించగలరని’ ఆరోపించిన సంగతి తెలిసిందే. 2015నాటి సోహ్రాబుద్దీన్ ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన కేసులో రాహుల్ ఈ ఆరోపణలు చేయడంతో ఆయనపై క్రిమినల్ పరువు నష్టం పిటిషనల్ దాఖలైంది. పెద్ద నోట్ల రద్దు అనంతరం ఏడీసీ బ్యాంకు కేవలం ఐదు రోజుల వ్యవధిలో 750 కోట్ల పాత నోట్లను కొత్త నోట్లుగా మార్చుకోవడాన్ని ప్రస్తావిస్తూ బ్యాంకు కుంభకోణానికి పాల్పడిందని రాహుల్ అప్పట్లో ఆరోపించారు. అహ్మదాబాద్ జిల్లా కోపరేటివ్ బ్యాంకుకు అమిత్ షా డైరెక్టర్‌గా ఉన్నారు. దీనిపై కూడా రాహుల్‌పై పరువు నష్టం దావా పిటిషన్ దాఖలైంది. ఈ కేసులో కూడా రాహుల్ తాను ‘నిర్దోషి’ నేనని వివరించారు. దీనిపై కూడా వ్యక్తిగత హాజరుపై శాశ్వత మినహాయింపును ఆయన లాయరు కోర్టుకు వివరించారు. రాహుల్‌తో పాటు బ్యాంకు చైర్మన్ అజయ్ పటేల్ కూడా కోర్టుకు హాజరయ్యారు. ఇరు వర్గాల వాదనలు విన్న చీఫ్ జుడీషియల్ మెజిస్ట్రేట్ ఎన్‌బీ మునీష్ డిసెంబర్ ఏడో తేదీన విచారణ కొనసాగించనున్నట్లు స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే, మోదీ ఇంటిపేరుతో ఉన్న వారంతా దొంగలేనని చేసిన ఆరోపణలపై గురువారం రాహుల్ సూరత్ కోర్టుకు హాజరైన సంగతి తెలిసిందే.