క్రైమ్/లీగల్

బాలికపై వృద్ధుడి అత్యాచారం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గంట్యాడ, అక్టోబర్ 10: విజయనగరం జిల్లా గంట్యాడ మండలంలోని కొండ తామరాపల్లి గ్రామానికి చెందిన ఏడేళ్ల మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందిన 65 ఏళ్ల వృద్ధుడు అత్యాచారం చేశాడు. గురువారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో జరిగిన ఈ సంఘటనపై బాధిత బాలిక తల్లి సంతోషి సాయంత్రం గంట్యాడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కొండతామరాపల్లి గ్రామానికి చెందిన బాలిక రెండో తరగతి విద్యార్థిని. గురువారం మధ్యాహ్నం సమయంలో పూల మొక్కలు తీసుకురావడానికి అదే గ్రామంలో ఉన్న వృద్ధుడు చిన్నారావు టీ కొట్టుకు వెళ్లింది. బాలికకు మాయమాటలు చెప్పి పూలమొక్కలు ఇస్తానని చెప్పి చిన్నారావు లోపలికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. బాలిక కన్నీరు మున్నీరవుతూ తల్లికి విషయం తెలియజేయగా సాయంత్రం గంట్యాడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఇన్‌ఛార్జి ఎస్సై వర్మ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.