క్రైమ్/లీగల్

రవిప్రకాష్ పోలీసు కస్టడీపై విచారణ నేటికి వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 10: సంస్థ నిధులను అక్రమంగా వినియోగించుకున్నారనే ఆరోపణలపై పోలీసులు అరెస్టు చేసిన టీవీ-9 మాజీ సీఈఓ రవిప్రకాశ్ కస్టడీ పిటిషన్‌పై గురువారం నాడు నాంపల్లి కోర్టులో వాదనలు కొనసాగాయి. షరతులతో కూడిన ముందస్తు బెయిల్‌పై ఆదేశాలు స్పష్టంగా ఉన్నా కింది కోర్టులు, పోలీసులు పట్టించుకోలేదని రవిప్రకాశ్ తరఫున న్యాయవాదులు తమ వాదనలో ఆరోపించారు. కాగా, వెంటనే ఆయనను పోలీసు కస్టడీకి అప్పగించాలని ప్రభుత్వ న్యాయవాది కోరారు. ఇరు వర్గాల వాదనలు విన్నతర్వాత, హైకోర్టు ఆదేశాలతో పాటు, కేసు తీవ్రత దృష్ట్యా తీర్పును శుక్రవారం నాడు వెలువరించనున్నట్టు న్యాయాధికారి పేర్కొన్నారు.