క్రైమ్/లీగల్

రూ. 3 లక్షల లంచంతో దొరికిపోయిన కేటీపీఎస్ సీఈ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాల్వంచ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కేటీపీఎస్ 5,6వ దశల చీఫ్ ఇంజనీర్‌గా విధులు నిర్వహిస్తున్న కే. ఆనందం ఒక కాంట్రాక్టర్ వద్ద నుంచి రూ.3లక్షలు లంచం తీసుకుంటూ గురువారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్‌పీ బీ.ప్రతాప్ తెలిపిన వివరాల మేరకు.. కేటీపీఎస్ 5,6వ దశల కర్మాగారంలో ఇటీవల 21 పనులకు గాను టెండర్ పెట్టారు. ఈ టెండర్‌ను పాల్వంచకు చెందిన కాంట్రాక్టర్ లలితామోహన్ అనే వ్యక్తి దక్కించుకున్నారు. 74 లక్షల రూపాయల విలువ గల ఈ టెండర్ పనుల నిమిత్తం సీఈ ఆనందంను సదరు కాంట్రాక్టర్ కలిశారు. దీనిపై టెండర్ పనులు ప్రారంభించాలంటే రూ.10 లక్షలు ముట్ట చెప్పాలని కాంట్రాక్టర్‌ను సీఈ ఆనందం డిమాండ్ చేశారు.
అందుకు కాంట్రాక్టర్ మొదటి దఫాగా గత 10 రోజుల క్రితం రూ.2 లక్షలు సీఈ ఆనందంకు ఇచ్చారు. మిగిలిన 8లక్షల రూపాయలను గురువారం లోపు ఇవ్వాలని లేని పక్షంలో టెండర్‌ను రద్దు చేస్తామని సీఈ బెదిరించడంతో సదరు కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఇందులో భాగంగా కాంట్రాక్టర్ సీఈ కార్యాలయంలో ఆనందంను కలిసి రూ.3లక్షలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు దాడిచేసి సీఈని పట్టుకున్నారు. అదేవిధంగా సీఈ నివాసం ఉంటున్న జెన్‌కో కాలనీలోని గెస్ట్‌హౌస్‌ను సందర్శించి అక్కడ కూడా తనిఖీ చేసి కొంత నగదును, విలువైన రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన సీఈ ఆనందంను, నగదును శుక్రవారం కోర్టులో హాజరు పర్చనున్నట్లుగా తెలిపారు.
*చిత్రం...ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ సీఈ ఆనందం