క్రైమ్/లీగల్

ఈఎస్‌ఐ కుంభకోణం కేసులో ముగిసిన రెండు రోజుల కస్టడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 10: ఈఎస్‌ఐ మందుల కుంభకోణం కేసులో ఏసీబీ అధికారులు విచారణను ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ఈఎస్‌ఐ కుంభకోణంలో మరింత సమాచారాన్ని నిందితుల నుండి సేకరించేందుకు ఏసీబీ ఈఎస్‌ఐ డైరెక్టర్ దేవికారాణితో పాటు మరో ఆరుగురు నిందితులను కౌస్టడీలొకి తీసుకున్నారు. దీంతో రెండు రోజుల కస్టడీ ముగిసింది. ఈరోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు నిందితులను అధికారులు విచారించారు. మందుల కొనుగోళ్లు, ఫార్మాకంపెనీల టెండర్లు, బ్యాంక్ లావాదేవీలు సంబంధించి ఏసీబీ అధికారులు ఆరాతీశారు. డైరెక్టరేట్‌లో ఉండాల్సిన డాక్యుమెంట్స్ ప్రైవేట్ వ్యక్తుల ఇళ్లలోకి ఏలా వెళ్లాయని నిందితులను ఏసీబీ అధికారులు ప్రశ్నించారు.
ఈ కేసుకు సంబంధించి ప్రైవేట్ వ్యక్తుల జోక్యం, అధికారుల ఆతిఉత్సహానికి సంబధించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టిన ఏసీబీ మరి కొంత మందిని అదుపులోకి తీసుకోనుంది. చర్లపల్లి, వరంగల్ డిస్పెన్సరీల నుంచి వచ్చిన ఇండెంట్లు, కొనుగోలుకు సంబంధించి ఆర్డర్ల విషయంలో ఏసీబీ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. ఈ కేసుకు సంబంధించి సాక్షులు తెలిపిన వాంగ్మూలం ఆధారంగా డైరెక్టర్ దేవికారాణిపై అధికారులు వివిధ ప్రశ్నలతో సమాచారం రాబట్టేందుకు ప్రయత్నించారు. మందుల కొనుగోళ్లకు సంబంధించిన జీవో 51 నిబంధనలు ఉద్దేశపూర్వకంగానే పాటించలేదని అభిప్రాయాన్ని అధికారులు వ్యక్తం చేశారు. రెండు రోజుల కస్టడీకి తీసుకున్న ఏడుగురి నిందితులను వేర్వేరుగా విచారించి స్టేట్ మెంట్లను నమోదు చేశారు.