క్రైమ్/లీగల్

చిదంబరం ముందస్తు బెయిల్ రద్దుచేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 10: ఎయిర్‌సెల్- మాక్సిస్ కేసులో మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి పి.చిదంబరంకు, ఆయన కుమారుడు కార్తి చిదంబరంకు ఇచ్చిన ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం ఢిల్లీ హైకోర్టును కోరింది. వారు ఆధారాలను తారుమారు చేసే అవకాశం ఉందని వాదించింది. ఈడీ దాఖలు చేసిన ఈ పిటిషన్ శుక్రవారం న్యాయమూర్తి సురేశ్ కైట్ ధర్మాసనం ముందుకు విచారణకు రానుంది. 74 ఏళ్ల చిదంబరంకు, ఆయన కుమారుడికి ప్రత్యేక న్యాయస్థానం సెప్టెంబర్ అయిదో తేదీన ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ జారీ చేసిన ఆదేశాలను సవాలు చేస్తూ ఈడీ పిటిషన్ దాఖలు చేసింది. ఐఎన్‌ఎక్స్ మీడియా అవినీతి కేసులో సీబీఐ చిదంబరంను ఆగస్టు 21న అరెస్టు చేయడంతో ఆయన ఇప్పుడు జైలులో ఉన్నారు.
సీబీఐ నమోదు చేసిన ఎయిర్‌సెల్- మాక్సిస్ కేసులో కూడా చిదంబరం, ఆయన కుమారుడికి ట్రయల్ కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఆర్థిక నేరాల కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయడం సరికాదని ఈడీ హైకోర్టులో వాదించింది. అందువల్ల చిదంబరంకు, ఆయన కుమారుడికి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ట్రయల్ కోర్టు జారీ చేసిన ఆదేశాలను కొట్టివేయాలని ఈడీ హైకోర్టును అభ్యర్థించింది. నిందితులిద్దరు నేర విచారణ సమయంలో అడిగిన ప్రశ్నలకు తప్పించుకునే రీతిలో సమాధానాలు ఇచ్చారని, వారు ఆధారాలను తారుమారు చేసే, సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని ఈడీ వాదించింది.