క్రైమ్/లీగల్

కర్నాటకలో ఐటీ దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, అక్టోబర్ 10: కర్నాటక మాజీ ఉప ముఖ్యమంత్రి జీ పరమేశ్వరపై గురువారం ఐటీ దాడులు జరిగాయి. ఆయన నివాసం, కార్యాలయాలపై ఆదాయపన్ను అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. పరమేశ్వరతోపాటు మాజీ ఎంపీ ఆర్‌ఎల్ జాలప్ప కుమారుడు జే రాజేంద్రపైనా ఐటీ దాడులు నిర్వహించారు. కాంగ్రెస్ సీనియర్ నేత పరమేశ్వర కుటుంబం నేతృత్వంలో సిద్ధార్థ గ్రూప్ విద్యా సంస్థలు నడుస్తున్నాయి. ఆయన తండ్రి హెచ్‌ఎం గంగాధరయ్య 58 ఏళ్ల క్రితం ఈ విద్యాసంస్థలను నెలకొల్పారు. పరమేశ్వర నివాసం, విద్యా సంస్థల్లో ఐటీ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేశారు. మాజీ ఉప ముఖ్యమంత్రి సోదరుడు జీ శివప్రసాద్, పీఏ రమేష్ ఇళ్లలోనూ సోదాలు జరిపినట్టు అధికారులు వెల్లడించారు. పీఏ రాజేంద్ర దొడ్డబల్లాపూర్, కోలార్‌లో ఆర్‌ఎల్ జాలప్ప ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నడుపుతున్నారు. నీట్ పరీక్షలు అలాగే కోట్లాది రూపాయల పన్ను ఎగవేతకు పాల్పడినట్టు పరమేశ్వర, తదితరులపై ఆరోపణలున్నాయి. దీంతో 30 ప్రాంతాల్లో ఐటీ దాడులు జరిగాయి. 80 మంది అధికారులు బృందాలుగా ఏర్పడి ఏకకాంలో దాడులు నిర్వహించారు. కర్నాటకతోపాటు రాజస్థాన్‌లోనూ విస్తృతమైన సోదాలు జరిపారు. కర్నాటకలోని తుంకూరు నగరంలోని రెండు మెడికల్ కళాశాల్లో నిర్వహించిన నీట్ పరీక్షల్లో అవకతవకలు జరిగినట్టు ఫిర్యాదులు వచ్చాయి. శ్రీ సిద్ధార్థ ఎడ్యూకేషన్ ట్రస్ట్‌కు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి పరమేశ్వర చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. నీట్ నిర్వహణలో అవకతవకలకుతోడు సీట్ల కేటాయింపులో భారీగా అక్రమాలకు పాల్పడినట్టు తెలిసింది. రెండు పరీక్షా కేంద్రాల్లో ఒకరి తరఫున ఒకరు పరీక్షకు హాజరైనట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో అధికారుల రాజస్థాన్ వెళ్లి కొందరు అనుమానిత అభ్యర్థులను గుర్తించినట్టు వెల్లడైంది. కాగా ఐటీ దాడుల సమాచారం అందుకున్న మాజీ ఉప ముఖ్యమంత్రి పరమేశ్వర హుటాహుటిన బెంగళూరు వచ్చారు. ఐటీ దాడులకు సంబంధించి ముందస్తు సమాచారం లేదని ఆయన అన్నారు. విద్యా సంస్థల నిర్వహణలో తమ కుటుంబం ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదని ఆయన చెప్పారు. అలాగే ప్రతి సంవత్సరం విధిగా ఐటీ రిటర్న్స్ దాఖలు చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు. రాజకీయ దురుద్దేశంతో దాడులు జరిగాయని భావిస్తున్నారా? అన్న ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి ఆయన నిరాకరించారు.

సిద్దరామయ్య, దేవేగౌడ ఖండన
మాజీ ఉప ముఖ్యమంత్రి పరమేశ్వర సంస్థలపై జరిగిన ఐటీ దాడులను మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య, జేడీఎస్ చీఫ్ దేవేగౌడ తీవ్రంగా ఖండించారు. పరమేశ్వర, రాజేంద్ర నివాసాల్లో జరిగిన సోదాలు రాజకీయ దురుద్దేశంతో కూడినవేనని వారు ఆరోపించారు. కర్నాటకలో కాంగ్రెస్ నాయకులను లక్ష్యంగా చేసుకుని కేంద్ర కక్షపూరితంగా వ్యవహరిస్తోందని సిద్దరామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలకు తాము భయపడేది లేదని ఆయన చెప్పారు. ఐటీ దాడులను అందరూ ఖండించాలని దేవేగౌడ అన్నారు. రాజకీయ కక్ష సాధింపుతోనే పరమేశ్వరపై ఆదాయపన్ను దాడులు జరిగాయని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్గే మండిపడ్డారు. దాడులతో కాంగ్రెస్ నేతలకు భయపెట్టాలని చూస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు.

*చిత్రం...సిద్దరామయ్య, దేవేగౌడ