క్రైమ్/లీగల్

సకాలంలో సమాచారం ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: భారత్‌లో వైద్య విద్యను అభ్యసించేందుకు వచ్చే విదేశీ విద్యార్థులకు కేంద్రం సకాలంలో సమాచారం అందించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. సమాచారం విషయంలోఎలాంటి జాప్యం లేకుండా చూడాలని, ఏటా ఆగస్టు 15 నాటికి ప్రవేశాలకు సంబంధించి అప్పటి వరకూ ఉన్న సమాచారం విదేశీ విద్యార్థులకు అందజేయాలని న్యాయమూర్తులు ఎల్ నాగేశ్వరరావు, హేమంత్ గుప్తాతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. భారత్‌లో వైద్య విద్యను అభ్యసించేందుకు విదేశాలు అలాగే ఈశాన్య దేశాల నుంచి పెద్ద ఎత్తున విద్యార్థులు వస్తుంటారు. గత ఏడాది ఎంబీబీఎస్ ఫస్టియర్ ప్రవేశాల్లో తలెత్తిన సమస్యను బెంచ్ ఈ సందర్భంగా ప్రస్తావించింది. ఆగస్టు 31వ తేదీలోగా ప్రభుత్వ కళాశాలల్లో ప్రవేశాలు పూర్తిచేయాల్సి ఉంటుంది. అయితే ఈ సమాచారం ముందురోజు అంటే ఆగస్టు 30న కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ ఇచ్చింది. దీని ఫలితంగా ఇరాన్, భూటాన్, నేపాల్‌కు చెందిన విద్యార్థులు ప్రవేశాలు పొందలేకపోయారు. తరువాత వస్తే సీట్లు దక్కని పరిస్థితి. విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ జాప్యం, ఆఖరి నిమిషంలో హడావుడి సమాచారం వల్ల బంగారు భవిష్యత్ నాశనమైందని విద్యార్థులు వాపోయారు. విదేశీ, ఈశాన్య రాష్ట్రాల తరఫున సుప్రీం కోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. గురువారం పిటిషన్ విచారించిన ధర్మాసనం కేంద్ర ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.‘ మెడికల్ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించి జాప్యం నివారించండి. తద్వారా విద్యార్థుల సమయం వృధాకాదు. విదేశాల నుంచి స్పాన్సర్డ్ విద్యార్థులకు సీట్ల లభ్యతపై స్పష్టమైన సమాచారం ఉండాలి. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచనలు ఇవ్వండి. ప్రవేశ గడువుకు కనీసం 15 రోజుల ముందు విద్యార్థులకు సమాచారం ఇవ్వండి’అని న్యాయమూర్తులు ఆదేశించారు. ఎయిమ్స్ తరఫున సీనియర్ న్యాయవాది దుష్యంత్ పరాషార్ కోర్టుకు హాజరయ్యారు. దేశంలోనే అత్యున్నత వైద్య సంస్థ ఎయిమ్స్‌లో విదేశీ విద్యార్థుల కోసం ఏడు సీట్లు కేటాయిస్తున్నట్టు బెంచ్‌కు తెలిపారు. విదేశీ విద్యార్థులు సెప్టెంబర్ 2వ తేదీ నాటికి రిపోర్టు చేయకపోతే సీట్లు కేటాయించడం సాధ్యపడదని చెప్పారు. ఎంబీబీఎస్ ఫస్టియర్‌లో ప్రవేశాలు ఏటా ఆగస్టు 31న పూర్తిచేయాలని నిర్ణయించారు. ఈశాన్య రాష్ట్రాలు, నేపాల్, భూటాన్, ఇరాన్ దేశాల విద్యార్థులకు కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆఖరి నిమిషంలో ఆగస్టు 30న లెటర్లు పంపిందని కోర్టు పేర్కొంది. సెప్టెంబర్ 1, 2వ తేదీలోగా సంబంధిత కాలేజీల్లో రిపోర్టు చేయకపోతే గడువుతీరిపోయిందంటూ సీట్లు కేటాయించడం లేదని కోర్టు స్పష్టం చేసింది. అనవసరమైన జాప్యం నివారించాలని న్యాయమూర్తులు ఆదేశించారు. అలాగే వైద్య కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించి సుప్రీం కోర్టు 2016 జనవరి 18న షెడ్యూల్ ప్రకటించింది. ప్రవేశ పరీక్ష ద్వారా మెడికల్ కాలేజీల్లో సీట్ల భర్తీ చేయాలని స్పష్టం చేసింది. మే మొదటి వారంలో ఈ ప్రక్రియ మొదలెట్టి ప్రతి ఏటా ఆగస్టు 31 నాటికి పూర్తిచేయాలని ధర్మాసం తెలిపింది.