క్రైమ్/లీగల్

లైంగిక వేధింపుల కేసు బదిలీపై సుప్రీం కోర్టు స్టే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 9: ఓ ఐపీఎస్ అధికారిపై దాఖలైన లైంగిక వేధింపుల కేసు, అంతర్గత విచారణ కమిటీ(ఐసీసీ)ని పక్క రాష్ట్రానికి బదిలీ చేస్తూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీం కోర్టు స్టే విధించింది. దర్యాప్తు, ఐసీసీని మరో రాష్ట్రానికి బదిలీ చేసే అధికారం హైకోర్టుకు ఉందా? అన్నదానిపై పరిశీలించేందుకు సుప్రీం కోర్టు అంగీకరించింది. మద్రాస్ హైకోర్టు ఆదేశాలను సదరు ఐపీఎస్ అధికారి సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. దీనిపై స్పందించిన సుప్రీం కోర్టు తమిళనాడు ప్రభుత్వం, వివిధ శాఖలు, కేసుతో సంబంధం ఉన్న పలువురికి నోటీసులు జారీ చేసింది. న్యాయమూర్తులు ఇందూ మల్హోత్ర, ఆర్ సుభాష్‌రెడ్డితో కూడిన ధర్మాసనం ఆగస్టు 28న హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను నిలిపివేసింది. తదుపరి విచారణను నాలుగువారాలకు వాయిదా వేసింది. కేసు పూర్వాపరాలు ఇలా ఉన్నాయి. 44 ఏళ్ల ఐపీఎస్ అధికారిణి తమిళనాడులో పోలీసు సూపరింటిండెంట్‌గా పనిచేస్తున్నారు. చెన్నైలో పనిచేస్తున్న సీనియర్ అధికారి తనను లైంగికంగా వేధిస్తున్నారని గత ఏడాది ఆగస్టులో ఫిర్యాదు చేశారు. దీనిపై అంతర్గత విచారణ కమిటీ(ఐసీసీ)ని ఏర్పాటు చేస్తూ అప్పటి హైకోర్టు మహిళా న్యాయమూర్తి ఆదేశాలు ఇచ్చారు. తరువాత మహిళా అధికారిణి సీనియర్ ఐపీఎస్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఇలా ఉండగా దీనిపై దాఖలైన పిటిషన్‌ను విచారించిన మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ ఐసీసీ, ఎఫ్‌ఐఆర్‌ను తెలంగాణ రాష్ట్రానికి బదిలీ చేసింది. కేరళ లేదా మరో రాష్ట్రానికి ఎఫ్‌ఐఆర్, ఐసీసీని బదిలీ చేస్తే తనకు అభ్యంతరం లేదని లేడీ ఆఫీసర్ అఫిడవిట్ దాఖలు చేసి అంగీకారం తెలిపారు. అయితే పనిచేసే చోట మహిళపై జరిగే లైంగిక వేధింపుల(నివారణ, నిషేధం, పరిహారం) చట్టం 2013 కింద ఇది చెల్లుబాటు కాదని ఐపీఎస్ అధికారి సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. దానికి చట్టబద్ధత లేదని ఆయన వాదించారు.
ఐపీఎస్ అధికారి అప్పీల్‌ను విచారించిన సుప్రీం కోర్టు ధర్మాసనం హైకోర్టు ఆదేశాలపై స్టే విధించింది. హైకోర్టుకు ఆ అధికారం ఉందా? అన్నదానిపై అధ్యయనం చేస్తామని బెంచ్ ప్రకటించింది.