క్రైమ్/లీగల్

14 మందిపై భూకబ్జా కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, అక్టోబర్ 7: ఉప్పల్ బాలాజీ ఎన్‌క్లేవ్ సమీపంలోని సర్వే నెంబర్ 34, 35, 36, 37, 39లోని ఆరు ఎకరాల 11 గుంటల స్థలాన్ని కబ్జా చేశారని పీర్జాదిగూడ విష్ణుపురి కాలనీకి చెందిన రాచెరువు దేవా రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు 14 మందిపై సెక్షన్ 447, 427, 506, ఆర్/డబ్ల్యు 34 ఐపీసీ కింద కేసు నమోదు చేసినట్లు ఉప్పల్ పోలీసులు తెలిపారు. తమ సొంత స్థలంపై ల్యాండ్ మాఫియాతో దౌర్జన్యం చేస్తూ బెదిరిస్తూ కబ్జా చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. విషయంలో ఇచ్చిన ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు మాతం మల్లమ్మ అలియాస్ కమలమ్మ, కృష్ణ, స్వరూప, టీ.అంజిరెడ్డి, తిరుమల్ రెడ్డి, త్రిభువన్ రెడ్డి, శ్రీనివాస్, సాయితేజ, పీ.శ్రీకాంత్, బీ.శ్రీకాంత్, వీ.నారాయణ, పీ.దయాకర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, బీ.చంద్రా రెడ్డిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఇదిలా ఉండగా కోర్టు స్టే ఉండగా కబ్జాదారులు స్థలంలో నిర్మాణ పనులు చేయడమేమిటని స్థల యజమానులు కుటుంబ సభ్యులతో సోమవారం పోలీసు స్టేషన్, తహశీల్దార్ కార్యాలయంలో ఆందోళన చేశారు. తహశీల్దార్ ప్రమీలా రాణితో వాగ్వివాదానికి దిగారు. మాఫియా అరాచకాలపై ఎందుకు వౌనం వహిస్తున్నారని మాజీ హోం శాఖ మంత్రి నాయిని నర్సింహా రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ రెవెన్యూ రికార్డుల్లో సంబంధంలేని వారి పేర్లు ఆన్‌లైన్‌లో ఎలా నమోదు చేశారని తహశీల్దార్‌ను ఫోన్‌లో అడిగారు. ఆన్‌లైన్‌లో పేర్లను తొలగిస్తూ పత్రాలను ఫిర్యాదు దారులకు అందజేసినట్లు తహశీల్దార్ ప్రమీలా రాణి స్పష్టం చేశారు.