క్రైమ్/లీగల్

డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు : రాష్ట్రంలోని విద్యార్థులకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఓ అంతర్జాతీయ ముఠాను, వారికి సహకరిస్తున్న మరో ఇద్దరు వ్యక్తులను నెల్లూరు పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. నెల్లూరులో మాదకద్రవ్యాలకు బానిసగా మారి, చివరకు వాటిని ఇతర విద్యార్థులకు అమ్ముతున్న ఓ యువకుడిని తొలుత పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా చెన్నై, బెంగళూరు నుండి దక్షిణ భారతదేశంలోని ఇతర ప్రాంతాలకు అమ్ముతున్న ముఠా వివరాలు వెలుగుచూశాయి. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగీ సోమవారం నెల్లూరులో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. నెల్లూరులో డిగ్రీ చదువుతున్న సాదిక్ డ్రగ్స్‌కు బానిసయ్యాడు. ఈ క్రమంలో తన స్నేహితులకు కూడా డ్రగ్స్‌ను
అమ్మడం ప్రారంభించాడు. డ్రగ్స్ కోసం చెన్నైలో ఉన్న లక్ష్మీనారాయణ, బెంగళూరులో ఉంటున్న శామ్యూల్ ఉబే, యెహీరమ్ నునెస్‌ల నుండి కొనుగోలు చేస్తుండేవాడు. శామ్యూల్ నైజీరియాకు, యెహీరమ్ గినీబిసూ దేశానికి చెందిన వారు. వీరి వీసా పరిమితి అయిపోయినప్పటికీ వీరు ఇండియాలో ఉంటూ డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. వీరందరూ క్రిప్టో కరెన్సీని చెల్లిస్తూ కొన్ని నిషేధిత వెబ్‌సైట్ల నుండి డ్రగ్స్‌ను కొనుగోలు చేస్తుండేవాడు. కర్నాటక, గోవా, కేరళ, చెన్నై తదితర రాష్ట్రాల్లో జరిగే రేవ్ పార్టీల వివరాలను తెలుసుకుంటూ అక్కడ ఈ డ్రగ్స్‌ను విక్రయిస్తుంటారు. తొలుత లక్ష్మీనారాయణకు పరిచయమైన సాదిక్ అతని ద్వారా శామ్యూల్, యెహీరమ్‌లకు పరిచయమయ్యాడు. తరచూ వీరి వద్ద నుండి మాదకద్రవ్యాలను కొనుగోలు చేస్తూ తాను సేవిస్తూ మరికొంత మంది స్నేహితులకు ఈ డ్రగ్స్‌ను సరఫరా చేయడం అలవాటుగా మార్చుకున్నాడు. నెల్లూరు జిల్లాలో డ్రగ్స్ విచ్చలవిడిగా సరఫరా అవుతూ యువత మత్తులో జోగుతున్న విషయాన్ని తెలుసుకున్న ఎస్పీ ఐశ్వర్య రస్తోగీ జిల్లాకు ఈ డ్రగ్స్ ఎలా చేరుతున్నాయనే విషయంపై సమగ్ర దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. చెన్నై, బెంగళూరు కేంద్రాలుగా ఈ దందా కొనసాగుతున్నట్లు నిర్ధారించుకున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం కృష్ణపట్నం పోర్టు సమీపంలోని గోపాలపురం జంక్షన్ వద్ద డ్రగ్స్‌ను సరఫరా చేసేందుకు వచ్చిన నిందితులను నెల్లూరురూరల్ డి ఎస్పీ ఆధ్వర్యంలో కృష్ణపట్నం పోర్టు సి ఐ ఖాజావలి, ఎస్సై శివకృష్ణారెడ్డి తమ సిబ్బందితో కలిసి అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి ఓ టయోటా కారు, కొద్ది మోతాదులో కొకైన్, ఎల్ ఎస్ డి, ఎం డి ఎం ఏ డ్రగ్స్, లాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ప్రతిభ కనబర్చిన పోలీస్ అధికారులను, సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.