క్రైమ్/లీగల్

పత్తి చేలో కూలిన శిక్షణ విమానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, అక్టోబర్ 6: వాతావరణం అనుకూలించలేదో.. సిగ్నల్స్ అందలేదో తెలియదు కానీ.. ఇద్దరు ట్రైనీ పైలట్ల ప్రాణాలు గాల్లో కలిశాయి. పంట పొలాల్లో శిక్షణ విమానం కూలిపోవడంతో ఇద్దరు పైలట్లు మృతి చెందారు. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా బంట్వారం మండ లం సుల్తాన్‌పూర్ గ్రామ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు,
పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఆదివారం మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. సుల్తాన్‌పూర్ గ్రామ రైతులు పొలం పనుల్లో నిమగ్నమయ్యారు. ఉన్నట్టుండి ఆకాశంలో ఒక శిక్షణ విమానం పొలాలను తాకుతున్నట్లు చక్కర్లు కొట్టింది. రైతులు చూస్తుండగానే శిక్షణ విమానం కంతి మల్లేశం పొలంలో పడి ఒక్కసారిగా పెద్ద శబ్ధం చేస్తూ పేలి పోయింది. భయంతో అక్కడున్న రైతులు కొద్దిసేపటి తర్వాత వెళ్లి చూడగా, ఇద్దరు పైలట్ల మృతదేహాలు కనిపించాయి. సర్పంచ్ ద్వారా స్థానిక ఎస్సై, తహశీల్దార్‌కు సమాచారం అందించడంతో వారు వచ్చి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. టైనీ పైలట్ ప్రకాష్ విశాల్ (23), కోపైలట్ అమన్ ప్రీతికౌర్ (21)గా గుర్తించారు. ఈ శిక్షణ విమానం బేగంపేట్ విమానాశ్రయం నుంచి గుల్బర్గా వెళ్తున్నట్లు అధికారులు తెలిపారు. జిల్లా ఎస్పీ నారాయణ సంఘటన స్థలాన్ని సందర్శించారు. ఎయిర్‌క్రాఫ్ట్ అధికారులు వస్తేగాని పూర్తి వివరాలు తెలియవని, అప్పుడు మాత్రమే పూర్తిస్థాయిలో విచారణ చేపడతామని ఎస్పీ తెలిపారు.

*చిత్రం...బంట్వారం మండలం సుల్తాన్‌పూర్ పత్తి చేనులో కూలిన శిక్షణ విమానం