క్రైమ్/లీగల్

విశాఖ మన్యంలో మరో ఎన్‌కౌంటర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సీపట్నం : విశాఖ ఏజన్సీలో మరో ఎన్‌కౌంటర్ చేసుకుంది. జీకేవీధి మండలం గుమ్మిరేవుల శివారు ప్రేమలగొంది అటవీ ప్రాంతంలో సోమవారం సాయంత్రం ఆరు గంటల సమయంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. ఆదివారం ఉదయం మాదిగమల్లు - అన్నవరం అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు సహా ముగ్గురు మావోయిస్టులు హతమైన సంగతి తెలిసిందే. సంఘటన జరిగిన కొండపై భాగంలో మావోయస్టులు ఉన్నారనే సమాచారం మేరకు పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందగా మరో 15 మంది వరకు మావోయిస్టులు సంఘటనా స్థలం నుండి తప్పించుకున్నారు. వీరి కోసం పోలీసు బలగాలు గాలింపు నిర్వహిస్తుండగా సోమవారం సాయంత్రం ప్రేమలగొంది వద్ద మావోయస్టులు తారసపడడంతో పోలీసులు కాల్పులకు దిగారు. ఈ కాల్పుల్లో మరో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసులు చెబుతున్నారు. 36 గంటల వ్యవధిలో రెండు ఎన్‌కౌంటర్ సంఘటనలు చోటు చేసుకోవడం, ఐదుగురు మావోయిస్టులు హతం కావడం విశాఖ మన్యంలో కలకలం రేపింది. సంఘటన జరిగిన ప్రాంతంలో పోలీసులకు ఒక ఏకే-47, 303 తుపాకీ, ఒక పిస్టల్ లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. ఏకే-47 రైఫిల్ దొరకడంతో చనిపోయిన ఇద్దరు మావోయిస్టుల్లో కీలకనేత ఒకరు హతమైనట్లు భావిస్తున్నారు.
మృతులు చత్తీస్‌గఢ్ మావోలు
సీలేరు: విశాఖ జిల్లా జీకేవీధి మండలం గుమ్మిరేవుల పంచాయతీ శివారు మాదిగమల్లు- అన్నవరం అటవీ ప్రాంతంలోని గదబగూడ వద్ద మావోయిస్టులకు, పోలీసులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో మృతి చెందిన మావోయిస్టులు చత్తీస్‌గఢ్‌కు చెందిన వారిగా ప్రాథమికంగా గుర్తించామని ఏఎస్పీ సతీష్‌కుమార్ సోమవారం విలేఖరులకు తెలిపారు. ఆదివారంనాటి ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టుల మృతదేహాలను సోమవారం రాత్రి ఏడు గంటల సమయంలో ప్రత్యేక వాహనాలపై దారకొండకు తీసుకొచ్చారన్నారు. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించేందుకు వీలుగా నర్సీపట్నం తరలించారు.