క్రైమ్/లీగల్

కాశ్మీర్‌లో ముగ్గురు తీవ్రవాదుల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మూ, సెప్టెంబర్ 23: జమ్మూకాశ్మీర్‌లోని కిష్త్‌వార్ జిల్లాలో కరుడుగట్టిన ముగ్గురు తీవ్రవాదులను అరెస్టు చేశారు. హిజ్బుల్ ముజాహిదీన్ తీవ్రవాదులను అదుపులోకి తీసుకున్నట్టు సోమవారం పోలీసులు వెల్లడించారు. వారిపై నాలుగు ఉగ్రవాద కేసులు, బీజేపీ నేత అలాగే ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తను హత్య చేసిన కేసుల్లో ఉన్నట్టు జమ్మూజోన్ ఐజీ ముఖేష్ సింగ్ తెలిపారు. నిస్సార్ అహ్మద్ షేక్ ప్రధాన కుట్రదారుడు కాగా ఆజాద్ హుస్సేన్, నిషాద్ అహ్మద్ కిష్త్‌వార్ జిల్లాకు చెందిన వారని అన్నారు. గత ఏడాది నవంబర్ నుంచి ఈనెల వరకు అనేక ఉగ్రవాద కార్యకలాపాల్లో ముగ్గురూ పాల్గొన్నారని ఐజీ స్పష్టం చేశారు. ముగ్గురు తీవ్రవాదులను అరెస్టు చేయడం వల్ల బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ నేతల హత్య కేసులు ఛేదించినట్టయిందని ఆయన వెల్లడించారు. ఐజీతోపాటు తొమ్మిదో సెక్టార్ కమాండర్ బ్రిగేడియర్ విక్రం భాన్ మిగతా సీనియర్ అధికారులు విలేఖరుల సమావేశంలో పాల్గొన్నారు. షేక్, హుస్సేన్ ఇళ్లపై పోలీసులు దాడి చేసి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. పిస్తోళ్లు, రైఫిల్, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్టు ఐజీ తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారికి సహకరించినా, మద్దతు తెలిపినా, సానుభూతిపరులుగా ఉన్నా కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. పర్వత ప్రాంతమై కిష్త్‌వార్ జిల్లాను తీవ్రవాద రహితంగా దశాబ్దం క్రితమే ప్రకటించారు. అయితే గత పది నెలలుగా ఉగ్రదాడులు, ఆయుధాలు ఎత్తుకెళ్లడం వంటి సంఘటనలు జరుగుతున్నాయి. 2018 నవంబర్ 1న బీజేపీ నేత అనిల్ పారిహర్, ఆయన సోదరుడు అజిత్ పారిహార్‌ను హత్య చేశారు. డిప్యూటీ పోలీసు కమిషనర్ వ్యక్తిగత భద్రతాధికారి దిలీప్ కుమార్‌పై దాడి చేసి సర్వీస్ రివాల్వర్‌ను ఎత్తుకెళ్తారు. ఇది 2019 మార్చి 8 జరిగింది. ఏప్రిల్ 9న జిల్లా ఆసుపత్రిపై దాడి చేసి ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త చంద్రకాంత్ శర్మను హత్య చేశారు. ఈనెల 13న పీడీపీ జిల్లా అధ్యక్షుడు షేక్ నజీర్ హుస్సేన్ ఇంటిపై దాడి చేసి అంగరక్షకుడి నుంచి సర్వీర్ రైఫిల్‌ను తీసుకుని పారిపోయారు. గౌరియన్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుందని ఐజీ స్పష్టం చేశారు.