క్రైమ్/లీగల్

పెడసనగల్లులో చోరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కూచిపూడి, సెప్టెంబర్ 22: వరుస దొంగతనాలతో మొవ్వ మండలంలోని పలు గ్రామాల ప్రజలు కంటిమీద కునుకులేకుండా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ నెలలో మంత్రిపాలెం, పెదపూడి గ్రామాలలో జరిగిన దొంగతనాల చేదు అనుభవాలు మది నుండి తప్పపోకముందే ఆదివారం పెడసనగల్లు గ్రామంలో భారీ దొంగతనం జరగటంతో ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. పోలీసు శాఖ వైఫల్యంగా పలువురు విమర్శిస్తున్నారు. పెడసనగల్లు గ్రామానికి చెందిన చీకటిమర్ల శ్రీరామతీర్ధ హనుమాన్ గుప్తాకు ఆరోగ్యం సరిగ్గా లేకపోవటంతో వైద్య చికిత్సలు కోసం కుటుంబ సభ్యులు 15 రోజులు కిందట తరలి వెళ్లారు. తమ గృహాన్ని చూస్తుండమని బంధువులకు తెలిపారు. ఆ బంధువులు రోజూ గృహాన్ని పరిశీలించారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం ఇంటి గొళ్లాలు, గడిలను పగులగొట్టి ఉండటాన్ని చూశారు. దీంతో కంగారు పడి వారు హనుమాన్ గుప్తాకు సమాచారం తెలిపి ఇంట్లో చూడగా బీరువా తాళాలు పగుల గొట్టి ఉండటంతో సామానులు చిందరవందర పడి ఉండటాన్ని గమనించారు. దీంతో హనుమాన్ గుప్తా భార్య వచ్చి చూడగా దాదాపు మూడు కిలోల వెండి సామానులు చోరీకి గురైనట్లు తెలిపారు. అయితే బంగారు నగలు మాత్రం బ్యాంక్ లాకర్లలో ఉండటంతో అవి రక్షించబడ్డాయి. ఈ సమాచారం తెలుసుకున్న కూచిపూడి ఎస్‌ఐ కె ప్రతాప్‌రెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించి విజయవాడ సీసీఎస్ కార్యాలయానికి తెలియపర్చి క్లూస్ టీమ్‌ను రప్పించారు. వారు వేలి ముద్రలను సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.