క్రైమ్/లీగల్

చోరీలకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర దొంగ అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, సెప్టెంబర్ 22: రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర దొంగను అవనిగడ్డ సీసీఎస్ పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన నిందితుడిని ఆదివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో అడిషనల్ ఎస్పీ మోకా సత్తిబాబు మీడియా ముందు హాజరుపరిచారు. ఈ సందర్భంగా ఎఎస్పీ సత్తిబాబు మాట్లాడుతూ చల్లపల్లి మండలం రామానగరంకు చెందిన ముచ్చు సీతారామయ్య 2009 నుండి అనేక నేరాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో నేరాలకు పాల్పడి అనేక సార్లు అరెస్ట్ అయినట్లు తెలిపారు. చల్లపల్లి పోలీసు స్టేషన్‌లో సీతారామయ్యపై రౌడీషీట్ కూడా తెరిచామన్నారు. 2018-19 సంవత్సరాల్లో చల్లపల్లి, మచిలీపట్నం, గుడివాడ పోలీసు స్టేషన్‌ల పరిధిలో ఏడు చోరీలకు పాల్పడినట్లు తెలిపారు. ఈ ఏడు చోరీ కేసుల్లో 358.084 గ్రాముల బంగారం, 236.500 గ్రాముల వెండి అభరణాలు, రూ.18వేలు నగదు, ఒక ఎల్‌ఇడీ టీవీని చోరీ చేసినట్లు తెలిపారు. వీటి విలువ సుమారు రూ.15లక్షలు ఉంటుందని తెలిపారు. వీటన్నింటినీ పూర్తిగా నిందితుడిని రికవరీ చేశామన్నారు. నేర నియంత్రణ, కేసుల చేధనలో సీసీఎస్ పోలీసులు సమర్ధవంతమైన సేవలు అందిస్తున్నారన్నారు. జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు సారధ్యంలో జిల్లాలోని ఐదు సబ్ డివిజన్‌లలో సీసీఎస్‌ను బలోపేతం చేస్తామన్నారు. ఐదు సబ్ డివిజన్‌లకు ప్రత్యేకంగా ఎస్‌ఐలు, సిబ్బందిని కేటాయించినట్లు తెలిపారు. వీరంతా ఒక స్పిరిట్‌తో పని చేస్తూ నేరస్థులను పట్టుకుని కటకటాల పాలు చేస్తున్నారని తెలిపారు. ఇదే స్పిరిట్‌తో రానున్న రోజుల్లో కూడా కేసుల చేదనలో సీసీఎస్ పోలీసులు కీలక పాత్ర పోషించాలన్నారు. ఈ సమావేశంలో సీసీఎస్ డీఎస్పీ అజీజ్, సీసీఎస్ సీఐ డివి సుబ్బారావు, చల్లపల్లి సీఐ వెంకట నారాయణ, సీసీఎస్ ఎస్‌ఐలు కె శ్రీనివాస్, సత్యనారాయణ, హబీబ్ బాషా, వెంకటేశ్వరరావు, చల్లపల్లి ఎస్‌ఐ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.