క్రైమ్/లీగల్

మెట్రో స్టేషన్ పెచ్చులూడి మహిళ దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సనత్‌నగర్, సెప్టెంబర్ 22: నిత్యం జనసంద్రంగా ఉండే అమీర్‌పేట మెట్రోస్టేషన్ వద్ద ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. స్టేషన్‌ను అందంగా రూపొందించేందుకు చేసిన ప్లాస్టింగ్ పెచ్చులూడి ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతిచెందిన సంఘటన నగర ప్రజలను తీవ్ర విషాదంలోకి నెట్టివేసింది. పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. కూకట్‌పల్లిలో నివాసం ఉండే హరికాంత్ రెడ్డి భార్య వౌనిక(26) టీసీఎస్ సంస్థలో ఇంజనీర్‌గా పనిచేస్తుంది. అమీర్‌పేటలో కోచింగ్ తీసుకుంటుంది. ఆదివారం మెట్రోలో అమీర్‌పేటకు వచ్చింది. ఆ సమయంలో వర్షం పడుతుండటంతో స్టేషన్ మెట్లవద్ద వేచి ఉంది. పిల్లర్ నెంబర్ ఏ-1053 వద్ద పెచ్చులూడి ఆమె తలపై పడ్డాయి. తీవ్ర రక్త స్రావంతో వౌనిక అక్కడికక్కడే కుప్పకూలింది. ఇది గమనించిన మెట్రో సిబ్బంది హుటాహుటిన ఆమెను స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించగా చికిత్స అందించేందుకు ప్రయత్నిస్తుండగానే మృతిచెందింది. సంఘటన స్థలాన్ని ఎస్సార్‌నగర్ పోలీసులు పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. వేలాది కోట్లు ఖర్చు చేసి ప్రతిష్టాత్మకంగా నిర్మించామని చెప్పుకునే మెట్రోస్టేషన్‌లో ఇలాంటి సంఘటన చోటుచేసుకోవడం తీవ్ర విచారకరమని ప్రయాణికులు, స్థానికులు వాపోతున్నారు. నగరంలోని ప్రధాన రహదారుల మధ్యలో నిర్మాణం జరిగిన మెట్రో పిల్లర్లు, వయోడక్ట్‌ల క్రింద ప్రయాణించాలంటే భయపడే పరిస్థితి నెలకొందని పేర్కొంటున్నారు. ఎల్ అండ్ టీ నాణ్యత లేని నిర్మాణం కారణంగానే తరుచూ మెట్రోస్టేషన్లు, వయోడక్ట్‌ల క్రింద ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపించారు.