క్రైమ్/లీగల్

సర్వీసు కమిషన్ కార్యదర్శిపై హైకోర్టు ఆగ్రహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 17: గురుకుల పాఠశాలల్లో పీఈటీ ఉద్యోగ నియామకాల ప్రక్రియ నిలిపేయాలన్న హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించినందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ చైర్మన్ డాక్టర్ గంటా చక్రపాణి, కార్యదర్శి వాణీప్రసాద్‌లపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు ఆదేశించినా ఫలితాలు, సర్ట్ఫికేట్ల పరిశీలన షెడ్యూలును ఎలా ప్రకటిస్తారని , ఇది కోర్టు ధిక్కారణగా పరిగణించాల్సి వస్తుందని పేర్కొంటూ పలువురు అభ్యర్ధులు హైకోర్టును ఆశ్రయించారు. దానిపై విచారణ ప్రారంభించిన హైకోర్టు కోర్టు ధిక్కారణ కింద గంటా చక్రపాణికి, వాణీ ప్రసాద్‌కూ రెండు వేలు చొప్పున జరిమానా విధించింది. ఆరు వారాల్లో జరిమానా చెల్లించాలని లేకపోతే నెల రోజుల పాటు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని హైకోర్టు పేర్కొంది.