క్రైమ్/లీగల్

పోలవరంపై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 16: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతిపై జోక్యం చేసుకోవాలని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పోలవరం ప్రాజెక్టు అవినీతిపై కేంద్ర సంస్థలకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదని.. దీనిపై జోక్యం చేసుకోవాలని కోరుతూ జనసేన నేత పెంటపాటి పుల్లారావు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జాతీయ ప్రాజెక్టు కావడంతో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినట్టు పేర్కొన్నారు. ఈ పిటిషన్ ప్రజా ప్రయోజన వ్యాజ్యంలా వుందని జస్టిస్ నవీన్ చావ్లా అభిప్రాయపడ్డారు. తదుపరి విచారణను అక్టోబరు తొమ్మిదికి వాయిదా వేశారు.