క్రైమ్/లీగల్

ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ తీర్పుపై వచ్చే వారం విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 13: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టానికి సంబంధించి గతంలో ఇచ్చిన తీర్పుపై ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం విచారణ చేపట్టనుంది. 2018 మార్చిలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు చట్టంలోని కొన్ని అంశాలను నీరుగార్చేవిగా ఉన్నాయంటూ కేంద్రం రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. శుక్రవారం కేంద్రం దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తులు అరుణ్ మిశ్రా, యూయూ లలిత్ ‘ రివ్యూ పిటిషన్ త్రిసభ్య ధర్మాసనం వచ్చే వారం విచారిస్తుంది’అని వెల్లడించారు. తీర్పును పునఃసమీక్షించాలన్న కేంద్రం అభ్యర్థనపై విచారించిన ఉన్నత న్యాయస్థానం మే 1న తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. 2018 మార్చి 20న సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు వల్ల సమస్యలు ఉత్పన్నమవుతాయని తన పిటిషన్‌లో కేంద్రం స్పష్టం చేసింది. అలాగే సుప్రీం తీర్పుపై దేశ వ్యాప్తంగా ఎస్సీ,ఎస్టీ వర్గాలు ఆందోళనకు దిగాయి. కొన్ని చోట్ల హింసాత్మక సంఘటనలూ చోటుచేసుకున్నాయి. అయితే కొన్ని రాజకీయ పార్టీలు సుప్రీం కోర్టు తీర్పుకు మద్దతు తెలిపాయి. పార్లమెంట్ షెడ్యూల్డ్ కులాల, షెడ్యూల్డ్ తెగల (వేధింపుల నివారణ) సవరణ 2018 చట్టం చేసింది. సుప్రీం తీర్పు వల్ల పరిస్థితి మరింత ఉద్రిక్తతలకు దారితీయకుండా కేంద్రం అప్రమత్తమైంది. తుది తీర్పు ఇచ్చేవరకూ స్టే మంజూరు చేయాలని కేంద్రం రివ్యూ పిటిషన్‌లో అభ్యర్థించింది. పిటిషన్‌ను విచారించిన కోర్టు జనవరి 30 స్టే ఇవ్వడానికి నిరాకరించింది.
ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి ముందస్తు బెయిల్ ఇవ్వకూడదన్న సవవరణలోని అంశాలను కోర్టు తిరస్కరించింది. దేశంలోని ఎస్సీ,ఎస్టీలకు అట్రాసిటీ చట్టం రక్షణ కవచంలా ఉందని, దానికి వ్యతిరేకంగా న్యాయస్థానం ఇచ్చిన తీర్పుతో ఇబ్బందులు వస్తాయని భావించిన కేంద్రం గత ఏడాది ఆగస్టు 20 బిల్లుకు ఆమోదం తెలిపింది. ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ చట్టం దుర్వినియోగం అవుతోందని, ముఖ్యంగా ప్రభుత్వం ఉద్యోగులపై అభియోగాలు వచ్చిన వెంటనే అరెస్టు చేయడాన్ని కోర్టు తప్పుపట్టింది. ఎలాంటి దర్యాప్తులేకుండా అరెస్టు చేయడం తగదని పేర్కొంది. చట్టం కింద అనేక సందర్భాల్లో అమాయకులు బలైపోతున్నారని, ఉద్యోగాలే కోల్పోయిన సంఘటనలున్నాయని బెంచ్ ఆందోళన వ్యక్తం చేసింది.