క్రైమ్/లీగల్

అవమానంతో వివాహిత ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, సెప్టెంబర్ 10: అవమానంతో వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన దుందిగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. దుందిగల్ గ్రామంలో నివాసముండే జోగు బిక్షపతికి భార్య భాగ్య (35), ఇద్దరు పిల్లలు ఉన్నారు. అదే గ్రామానికి చెందిన దార శ్రావన్ కుమార్ (28) భాగ్యతో వివాహేతర సంబంధం ఏర్పరుచుకున్నాడు. బిక్షపతి తన కుటుంబాన్ని మరో ఇంట్లోకి అద్దెకు మార్చాడు. శ్రావన్‌కుమార్ అర్థరాత్రి వేళల్లో భాగ్య వద్దకు వచ్చి వెళ్తున్నాడు. మంగళవారం నాడు శ్రావన్‌కుమార్ గోడ దూకి భాగ్య ఇంటికి వెళ్లాడు. కుటుంబ సభ్యుల ముందే భాగ్యతో అసభ్యంగా ప్రవర్తిస్తూ శ్రావన్‌కుమార్ దూషించాడు. దీంతో అవమానం భరించలేక భాగ్య ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. స్థానికుల సహాయంతో మంటలను ఆర్పివేసి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా భాగ్య మృతి చెందింది. మృతురాలి భర్త బిక్షపతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.