క్రైమ్/లీగల్

8మంది లష్కరే అనుచరుల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్ : కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లా సోపూర్ ప్రాంతంలో లష్కర్-ఏ- తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన ఎనిమిది మంది సహచరులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. లష్కర్-ఏ-తోయిబా ఉగ్రవాదుల ఆదేశాల మేరకు ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేలా ముద్రించిన పోస్టర్లను తరలిస్తుండగా అరెస్టు చేశామని పోలీసులు చెప్పారు. కాశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో ఈ పోస్టర్లు వెలిసాయి. ప్రజలను భయభ్రాంతులుగా చేసేలా ఈ పోస్టర్లు ఉన్నాయి. ఉత్తర కాశ్మీర్, బారాముల్లా జిల్లాలోని సోపూర్ ప్రాంతంలో పోస్టర్లు కలిగి ఉన్న 8 మందిని అరెస్టు చేసినట్లు పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు చెప్పారు. ఐజాజ్ మీర్, ఉమర్ మీర్, తౌసీఫ్ నజర్, ఇంతియాజ్ నజర్, ఉమర్ అక్బర్, ఫైజన్ లతీఫ్, దానిష్ హబీబ్, షౌకత్ అహ్మద్ మీర్‌ను అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. పోస్టర్లను సిద్ధం చేసి, పంపిణీ చేస్తున్నారని ఆయన చెప్పారు. స్థానిక ఉగ్రవాది సజ్జాద్ మీర్ అలియాస్ హైదర్ ఇంకా ఆయన అనుచరులైన ముద్దసీర్ పండిత్, అసిఫ్ మఖ్బూల్ భట్ లష్కర్-ఏ-తోయిబాకు అనుచరులుగా ఉన్నట్లు తెలిపారు. ఈ పోస్టర్ల తయారీ, పంపిణీ కుట్రలో వీరు ముఖ్య పాత్ర వహించారు. లష్కరే ఆదేశాలతో వీరు ఈ పనిని సానుభూతిపరులైన 8 మందికి అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. ఈ కుట్రలో ఇంకా ఎవరెవరు భాగస్వాములుగా ఉన్నారన్న కోణంలో పరిశోధన చేస్తున్నట్లు చెప్పారు.