క్రైమ్/లీగల్

నీటిలో మునిగి వృద్ధుడి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ పశ్చిమ, ఆగస్టు 24: నీటిపారుదల శాఖ అధికారులను మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్న ఇనుప పడవ తొలగింపు చర్యలను దగ్గరగా చూద్దామని నది దిగువ భాగాన ఆఫ్రాన్ వద్ద నీటిలో దిగిన గుర్తు తెలియని వృద్ధుడు నీటి ఒరవడికి కొట్టుకుపోయాడు. శనివారం మధ్యాహ్నం జరిగిన ఈ సంఘటనలో ఆ వ్యక్తిని కాపాడ్డానికి నాటు పడవల వారు ఎన్‌డీఆర్‌ఎఫ్ దళం సిబ్బంది ఒరవడి వెంట పరుగులు తీసినా ఫలితం లేకుండా పోయింది. సుమారు 65ఏళ్ల వయసున్న ఊరూపేరూ తెలియని వ్యక్తి ప్రకాశం బ్యారేజీ దిగువున ఆఫ్రాన్ వద్ద నీటిలో దిగాడు. అదే సమయంలో నీటిపారుదల శాఖ వారు జారీ చేసిన హెచ్చరికలు సైతం లెక్కచేయని జాలర్లు ఆఫ్రాన్ సమీపంలోని నీటిలోనే వలలు విసిరి చేపలు పడుతున్నారు. చేపల వేట చూద్దామనో లేదా పడవను తీసే యత్నాలను దగ్గరగా చూడాలనుకున్నాడోగాని నీటికి ఎదురుగా వెళ్లాడు. నీటి ఒరవడికి కొట్టుకుపోయాడు. నాటు పడవల వారు, ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది సదరు వ్యక్తిని ప్రాణాలతో కాపాడేందుకు యత్నించారు. బయటకు లాక్కొచ్చారు. అప్పటికే అతను మృత్యువాత పడ్డాడు. వృద్ధుడు వెళుతున్న తీరునుబట్టి అతను కావాలనే ఆత్మహత్య చేసుకోడానికి నీటికి ఎదువెళ్లాడని సందర్శకులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న కృష్ణలంక పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.