క్రైమ్/లీగల్

ఒకే కుటుంబంలో ముగ్గురిని కాటేసిన పాము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సింహులపేట: ఒకే కుటుంబంలో ముగ్గురిని పాము కాటేయగా భర్త మృతిచెందగా భార్య, కుమారుడు చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలోని కొమ్ములవంచ శివారు ఎర్రచక్రు తండాలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. తండావాసుల కథనం ప్రకారం ఎర్ర చక్రుతండాకు చెందిన జాటోతు రవి(38) భార్య నీల, కుమార్ చరణ్ ఒకే మంచంపై నిద్రిస్తున్న సమయంలో మంచంపై ఉన్న నూనెకట్ల పాము మొదటగా రవి, తరువాత భార్య నీల, కుమారున్ని కాటేయడంతో ప్రథమ చికిత్స చేయించారు. పరిస్థితి విసమం కావడంతో ఈ ముగ్గురిని మానుకోట ఏరియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ భర్త జాటోతు రవి ఆసుపత్రిలో మృతి చెందగా భార్య, కుమారున్ని ఏరియా ఆసుపత్రి నుండి ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. ఈ విషాద సంఘటను తెలుసుకున్న డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ వారి కుటుంబాన్ని పరామర్శించారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని పాము కాటేయడంతో తండాలో విషాధచాయలు అలుముకున్నాయి. బాధిత తల్లిదండ్రుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎసై సంతోష్‌రావు తెలిపారు. పరామర్శించిన వారిలో ఎమ్మెల్యే వెంట టీఆర్‌ఎస్ మండలపార్టీ అధ్యక్షుడు టేకుల యాదగిరిరెడ్డి, సర్పంచ్ లక్ష్మి, దాసరోజు వెంకటేశ్వర్లు, వైస్ ఎంపిపి దేవెందర్, పిఎసిఎస్ చైర్మన్ మైదం దేవెందర్, నాయకులు రామన్న, శ్రీనివాస్‌లు ఉన్నారు.

చిత్రం...మృతుని కుటుంబ సభ్యులను ఓదార్చుతున్న ఎమ్మెల్యే రెడ్యానాయక్