క్రైమ్/లీగల్

త్వరలో పార్లమెంటులో వ్యక్తిగత డేటా రక్షణ బిల్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 23: దేశంలోవ్యక్తులు, సంస్థల వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన డేటా పరిరక్షణకు కేంద్రం త్వరలో పార్లమెంటులోబిల్లును ప్రవేశపెట్టనుంది. ఈ బిల్లు ముసాయిదా ప్రతులను పరిశీలన నిమిత్తం అన్ని రాష్ట్రప్రభుత్వాలకు కేంద్రహోంశాఖ, ఎలక్ట్రానిక్స్, సమాచార టెక్నాలజీ మంత్రిత్వశాఖ పంపాయి. ఈ బిల్లును రిటైర్డు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీఎన్ కృష్ణ ఆధ్వర్యంలోని కమిటీ రూపొందించింది. డేటా బిల్లులో ప్రతిపాదించిన అంశాల ప్రకారం డేటా చౌర్యానికి పాల్పడినట్లు రుజువైతే మూడేళ్ల వరకు జైలు శిక్ష, రెండు లక్షల రూపాయల వరకు జరిమానాను విధించే అవకాశం ఉంది. డేటాను అనుమతి లేకుండా తీసకున్నా, వెల్లడించినా, బదలాయించినా, విక్రయించినా నేరమే. కీలకమైన సమాచారాన్ని చౌర్యం చేసినా, బదలాయించినా ఐదేళ్ల వరకు జైలు శిక్ష, మూడు లక్షల రూపాయల జరిమానాను విధించే క్లాజ్‌నుబిల్లులో చేర్చారు. కేంద్ర,రాష్ట్రప్రభుత్వాల ఆధీనంలోని శాఖలకు కూడా ఈ బిల్లు వర్తిస్తుంది. పాస్‌వర్డ్స్, వేతనం, ఎస్‌ఎంఎస్, కంటాక్ట్ వివరాలు, జీవన విధానం, వ్యక్తిగత జీవన విధానం, అలవాట్లు, ఆదార్, నివాస గృహం సమాచారమన్నీ డేటా బిల్లు పరిధిలోకి వస్తాయి.