క్రైమ్/లీగల్

తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఆగస్టు 23: తిరుమల నుంచి తిరుపతికి ద్విచక్ర వాహనంలో వస్తున్న సత్యనారాయణపురం, రాజీవ్ నగర్‌కు చెందిన ఎస్.దామోదరాచారి (45)ని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ సంఘటనలో వాహనం నడుపుతున్న ఆచారి అక్కడికక్కడే మృతి చెందాడు. వెనుక ఉన్న మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి. దామోదరాచారి తిరుమల నుంచి తిరుపతికి వస్తుండగా మొదటి ఘాట్ రోడ్డులోని జింకల పార్కు మలుపువద్ద ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ సంఘటనలో ద్విచక్ర వాహనం బస్సు కిందకు వెళ్లింది. వాహనం నడుపుతున్న ఆచారిపైకి ఆర్టీసీ బస్సు దూసుకెళ్లింది. దీంతో ఆ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. వెనుక ఉన్న మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది గాయాలపాలైన యువకుడిని చికిత్స కోసం స్విమ్స్‌కు తరలించారు. కాగా నడిరోడ్డుపై ప్రమాదం జరగడంతో దాదాపు మూడు కిలోమీటర్ల మేర వాహనాలు భారీగా ఆగిపోయాయి. దీంతో శ్రీవారిని దర్శించుకుని తిరుగు ప్రయాణమైన భక్తులు ఇబ్బంది పడ్డారు. ముఖ్యంగా తిరుపతి నుంచి రైలు, బస్సుల ద్వారా ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన యాత్రికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అలాగే ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.