క్రైమ్/లీగల్

యువకుడు ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తూరు రూరల్, ఆగస్టు 21: క్రిమిసంహారక మందు తాగి యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన కొత్తూరు మండలం కుమ్మరిగూడ గ్రామ శివారులో చోటు చేసుకుంది. కొత్తూరు సీఐ చంద్రబాబు కథనం ప్రకారం వివరాలు నందిగామ మండలం తాళ్లగూడ గ్రామానికి చెందిన శివకుమార్ (30) మంగళవారం మధ్యాహ్నం కొత్తూరు మండలం కుమ్మరిగూడ శివారులోని ఒక వెంచర్‌లో క్రిమిసంహారక మందు తాగి అపస్మారక స్థితిలో ఉన్నట్లు తెలిపారు. చికిత్స నిమిత్తం శంషాబాద్‌లోని ఓ ప్రైవేట్ వైద్యశాలకు తరలించగా బుధవారం మృతిచెందినట్లు సీఐ చంద్రబాబు తెలిపారు. ఆర్థిక ఇబ్బందులతో క్రిమిసంహరక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు సీఐ వివరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.