క్రైమ్/లీగల్

ఈబిజ్ ఎండీ అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గచ్చిబౌలి, ఆగస్టు 20: గొలుసు కట్టు వ్యాపారం పేరుతో నిరుద్యోగ యువతను మోసం చేసిన మల్టీలెవల్ మార్కెటింగ్ సంస్థ ఎండీని సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. తక్కువ పెట్టుబడితో కోట్లు సంపాదించ వచ్చని విద్యార్థులు, నిరుద్యోగులను మోసం చేస్తున్న ఈబిజ్ ఎండీ పవన్ మల్హన్‌ను ఆర్థిక నేరాల విభాగం (ఈఓడబ్ల్యూ) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గొలుసుకట్టు వ్యాపారానికి సంబంధించిన ప్రధాన నిందితులు ఎండీ పవన్ మల్హన్(62), ఆయన కుమారుడు హితిక్ మల్హన్ (31)ను అరెస్టు చేసినట్లు సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. విద్యార్థులు, నిరుద్యోగులను టార్గెట్ చేసుకుని సుమారు 5 వేల కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ మోసంపై సనత్‌నగర్‌లో నివాసి మహ్మద్ షారూ ఈనెల 9న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న ఈఓడబ్ల్యూ పోలీసులు ఎండీ పవన్, హితిక్ అరెస్టు చేశారు. ఈబిజ్ మల్టీలెవల్ మార్కెటింగ్ కంపెనీలో 17 లక్షల మంది వరకు సభ్యులు ఉన్నారు. వారివద్ద నుంచి ఐదు వేల కోట్ల రూపాయలు దండుకుని మోసం చేశారు. సంస్థకు చెందిన వివిధ బ్యాంకులలో ఉన్న 389 కోట్ల రూపాలయలను ఫ్రీజ్ చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ఈబిజ్ సంస్థపై సైబరాబాద్‌తో పాటు దేశ వ్యాప్తంగా పలు కేసులు ఉన్నాయన్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ పరిధిలో కూడా కేసు నమోదైనట్టు పోలీసులు తెలిపారు. 2001లో ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో సంస్థను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఈబిజ్ సంస్థను పవన్ మల్హాన్ పేరున ఆర్‌ఓసీ న్యూఢిల్లీలో నమోదు చేశారు. విలాసవంతమైన హోటళ్లలో సమావేశాలు ఏర్పాటు చేసి నిరుద్యోగులను ఆకర్షిస్తారు. సులువుగా డబ్బు సంపాదించాలో విద్యార్థులు, నిరుద్యోగులకు నూరిపోస్తారు. స్కీమ్‌లో సభ్యులుగా చేరాలంటే 16వేల 821 రూపాయలు చచెల్లించాల్సి ఉంటుందని పోలీసులు తెలిపారు. 10వేల రూపాయలు విలువ చేసే హెల్త్ ప్రొడెక్టు పేరుతో వస్తువులను ఇస్తారు. ఒక్కో సభ్యుడు మరో ముగ్గుర్ని చేర్పించాల్సి ఉంటుందని వివరించారు. తక్కువ కాలంలో కోట్ల రూపాయలు సంపాదించ వచ్చని ప్రలోభాలకు గరిచేసి యువకులను మోసం చేస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఇలాంటి గొలుసు కట్టు వ్యాపారంపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

చిత్రం...అరెస్టయన సంస్థ నిర్వాహకులు పవన్, హితిక్