క్రైమ్/లీగల్

హత్య కేసులో.. చోటా రాజన్‌కు ఎనిమిదేళ్ల కఠిన కారాగారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి : ఓ హత్య కేసులో గ్యాంగ్‌స్టర్ చోటా రాజన్‌కు, మరో ఐదుగురికీ ముంబయి కోర్టు ఎనిమిదేళ్ళు కఠిన కారాగార శిక్ష విధించింది. ఇంకా నిందితులందరికీ రూ.5 లక్షల చొప్పున జరిమానా విధించింది. 2012 సంవత్సరం అక్టోబర్‌లో ఓ హటల్‌కు చెందిన బీఆర్ శెట్టి అంధేరిలోని తన స్నేహితున్ని కలిసేందుకు వెళుతుండగా మార్గ మధ్యంలో చోటా రాజన్, ఆయన అనుచరులు దాడి చేసి హత్య చేశారు. ఆ తర్వాత రాజన్ ఇండోనేషియాకు పారిపోయాడు. దీంతో పోలీసులు వల పన్ని రాజన్‌ను అదుపులోకి తీసుకుని 2015లో భారత్‌కు తీసుకుని వచ్చి తీహార్ జైలులో ఉంచారు. ఈ కేసుపై ముంబయి ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎటీ వాంక్డే విచారణ కొనసాగించి మంగళవారం తీర్పు వెల్లడించారు. మహారాష్ట్ర వ్యవస్థీకృత నేర నివారణ చట్టం (ఎంసీఓసీఎ) కింద, ఇంకా భారత శిక్షాస్మృతిలోని పలు సెక్షన్ల కింద నిందితులపై కేసు నమోదైంది. చోటా రాజన్‌తో పాటు నిత్యానంద్ నాయక్, సెల్వెన్ డానియల్, రోహిత్ తంగప్పన్ జోసెఫ్ అలియాస్ సతీష్ కాళియా, దిలీప్ ఉపాధ్యాయ, తల్వీందర్ సింగ్‌కు శిక్ష పడింది.